అంతరిక్షంలోకి వెళ్లబోతున్న గొర్రె.. NASA, ESA మొదటి వ్యోమగామిగా..

అంతరిక్షంలోకి వెళ్లబోతున్న గొర్రె.. NASA, ESA మొదటి వ్యోమగామిగా..

ఓ గొర్రెకు గొప్ప అవకాశం దక్కింది.త్వరలోనే అంతరిక్షంలోకి వెళ్లబోతోంది.

 అంతరిక్షంలోకి వెళ్లబోతున్న గొర్రె.. Nasa, Esa మొదటి వ్యోమగామిగా..-TeluguStop.com

ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే.మీకు ఇది చిన్న విషయమే కావచ్చు.

కానీ గొర్రెలకు మాత్రం పెద్ద విషయమే.అయితే వెళ్లేది నిజమైన గొర్రె కాదండోయ్.

 అంతరిక్షంలోకి వెళ్లబోతున్న గొర్రె.. NASA, ESA మొదటి వ్యోమగామిగా..-అంతరిక్షంలోకి వెళ్లబోతున్న గొర్రె.. NASA, ESA మొదటి వ్యోమగామిగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీవీల్లో వచ్చే ‘షాన్ ది షీప్’ అనే ఓ కార్టూన్ ప్రోగ్రామ్ చూసే ఉంటారు.ఆ ప్రోగ్రామ్ లో ఉండే క్యారెక్టర్ షాన్ కి ఈ అవకాశం దక్కింది.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA), నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్టేషన్(NASA) ప్రయోగించబోతున్న ఆర్టెమిస్-1 లూనార్ మిషన్ లో షాన్ మొదటి వ్యోమగామిగా ఎంపికైంది…

‘షాన్ ది షీప్’ లో షాన్ క్యారెక్టర్ అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ పొందింది.అయితే షాన్ బొమ్మ రూపంలో అంతరిక్షంలోకి వెళ్లనుంది.

ఈనెలాఖరులో ప్రయోగం ప్రారంభించనున్నారు.షాన్ ది ఫీప్ బొమ్మ రూపంలో నాసా యొక్క మానవరహిత ఓరియన్ వ్యోమ నౌకలో చంద్రుని దాటి చాలా దూరం ప్రయాణించి ఒక నెలలో భూమికి తిరిగి వస్తుంది.

షాన్ ESA నుంచి ఆర్టెమిస్-1 అధికారిక ఫ్లయిట్ కిట్ లో చేర్చబడింది.ఇది మిషన్ యొక్క పవర్ సప్లయింగ్ సర్వీస్ మాడ్యూల్ ని కూడా అభివృద్ధి చేసింది.

ఆర్టెమిస్ 1 అనేది నాసా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లో జత చేసిన ESA సర్వీస్ మాడ్యూల్ తో సహజ ఉపగ్రహం ద్వారా ఎగురుతుంది.

Telugu Nasa, Sheep, Sheep Space, Space, Latest-Latest News - Telugu

అన్వేషించడంలో ఎంతో అభిరుచి ఉన్న షాన్ ప్రత్యేక ఎయిర్ బస్ ‘జీరో జి’ ఎ310 విమానంలో ప్రయాణిస్తున్నట్లు ESA తెలిపింది.స్టాప్ మోషన్ షీప్ ని రూపొందించిన యానిమేషన్ కంపెనీ ఆర్డ్ మాన్ సహకారంతో షాన్ నిజ జీవిత అంతరిక్ష యాత్రను ESA నిర్వహించింది.అంతరిక్షంలోకి మొదటి గొర్రెను ప్రయోగించడంలో తమ కంపెనీ ESAలో చేరినందుకు సంతోషంగా ఉందని ఆర్డ్ మాన్ మార్కెటింగ్ డైరెక్టర్ లూసీ వెండోవర్ అన్నారు.

చంద్రుని అన్వేషన లో షాన్ ముందున్నాడన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube