రాజమౌళి, చిరంజీవిలకు పెద్ద పరీక్ష

బాలీవుడ్ నుండి నెల రోజుల గ్యాప్ లో రెండు భారీ సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఆ రెండు సినిమా ల్లో బ్రహ్మాస్త్ర ఒకటి.

 Rajamouli And Chiranjeevi Presenting Bollywood Movies In Recent Times.rajamouli,-TeluguStop.com

వచ్చే నెలలో ఆ సినిమా విడుదల అవ్వబోతుంది.రణబీర్ కపూర్‌ హీరోగా ఆ సినిమా రూపొందుతోంది.

ఆ సినిమా ను తెలుగు లో కూడా అదే పేరు తో విడుదల చేయబోతున్నారు.గతంలో రణబీర్ కపూర్ ఏ ఒక్క సినిమా కూడా తెలుగు లో థియేటర్ల ద్వారా వచ్చిన దాఖలాలు లేవు.

అయినా కూడా సినిమా కు వచ్చిన బజ్‌ నేపథ్యంలో భారీ ఎత్తున వచ్చే నెలలో బ్రహ్మాస్త్ర సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా భారీ గా విడుదల కావడానికి ప్రథాన కారనం ఖచ్చితంగా టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి అనడంలో సందేహం లేదు.

ఆయన తెలుగు వర్షన్ ని సమర్పించేందుకు ముందుకు వచ్చాడు.ఆయన దర్శకత్వం లో సినిమా లు తప్ప ఇప్పటి వరకు ఆయన ఒక్క సినిమా ను కూడా సమర్పించడం కాని మరేమైన చేయలేదు.

కాని ఈ సినిమా కోసం ఆయన చాలా పెద్ద పని నెత్తికి ఎత్తుకున్నాడు.

Telugu Brahmastra, Chiranjeevi, Rajamouli, Telugu-Movie

ఇక ఈ వారంలో రాబోతున్న లాల్‌ సింగ్‌ చడ్డా సినిమా కూడా తెలుగు లో భారీ గా విడుదల కాబోతుంది.ఆమీర్‌ ఖాన్‌ అంటే తెలుగు లో మంచి క్రేజ్ ఉన్నా కూ డా భారీ ఎత్తున సినిమా విడుదల అయ్యే స్తాయి మాత్రం లేదు.కాని కేవలం మెగా స్టార్‌ చిరంజీవి వల్ల ఈ సినిమా ను తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ రెండు సినిమా లకు కూడా మన స్టార్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న నేపథ్యం లో కచ్చితంగా ఓపెనింగ్స్ అయితే బాగుంటాయి.కాని లాంగ్ రన్‌ లో సినిమా ఎలా ఉంటుంది అంటే మాత్రం అనుమానమే అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

ఈ రెండు సినిమా లకు మంచి బిజినెస్ కావడంలో వారిద్దరు ఉపయోగపడ్డారు.మరి జనాలను ఎంత వరకు వారు తీసుకు వస్తారు అనేది చూడాలి.మొత్తానికి ఈ రెండు సినిమా లు రాజమౌళి మరియు చిరంజీవికి కచ్చితంగా పెద్ద పరీక్ష అయ్యి ఉంటాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube