కస్టమర్స్ ముందు షో చేద్దామనుకుంది.. కానీ పరువు పోయింది.. వీడియో వైరల్..

కొంతమంది ఇతరులను ఇంప్రెస్ చేద్దామని రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.కానీ అవి ఫెయిల్ అయితే వారు నష్టపోవడం ఖాయం.

 She Wanted To Do A Show In Front Of Customers But The Honor Was Gone The Video W-TeluguStop.com

తాజాగా ఒక లేడీ వెయిటర్ కూడా ఏదో ప్రయోగం చేద్దామనుకుంది కానీ అది రివర్స్ కావడంతో చివరికి పరువు పోయింది.అంతే కాదు ఆమె డబ్బులు కూడా నష్టపోయింది.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది. @NoContextHumans ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది షేర్ చేసింది.

కొంత సమయానికే 14 లక్షల వ్యూస్ ను ఈ వీడియో క్లిప్ సొంతం చేసుకుంది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక వెయిటర్ టీ ఫ్లాస్క్ ( Waiter tea flask )పట్టుకొని ఉండటం చూడవచ్చు.ఆమె తన బూటు కాలుపై గ్లాస్ కూడా ఉంచడం గమనించవచ్చు.తర్వాత గ్లాస్ లో ఆమె ఫ్లాస్క్ నుంచి డ్రింక్ పోసింది తర్వాత క్లాసు పికప్ చేసుకోవాలని కిందకు వంగింది.

అంతే గ్లాస్ బ్యాలెన్స్ తప్పి ఆమె బూటు కాలు పైనుంచి కింద పడిపోయింది.దాంతో టీ మొత్తం నేల మీద పడిపోయింది.ఒక కస్టమర్ ఈ దృశ్యాలను తన ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు.దానిని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అది వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇదే వెర్రితనం అంటే” అని కామెంట్ పెడుతున్నారు.

సాధారణంగా వెయిటర్‌గా పని చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అసలు చేయకూడదు.ఎందుకంటే ఫెయిల్ అయితే కస్టమర్ల ముందు పరువు పోతుంది.“బాగా వెయిట్ చేస్తున్న కస్టమర్ల ముందు ఇలా డ్రింక్స్ నేలపాలు చేస్తే తిట్టే అవకాశం కూడా ఉంది.మేనేజర్ వద్ద చివాట్లు తినే ప్రమాదం కూడా ఉంది.” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నేల పాలైన ఆ డ్రింక్‌కు డబ్బులు వెయిటరే కదా కట్టాల్సింది, ఆమెకు వచ్చేదే కొంత మనీ మళ్ళీ అందులో ఇలాంటి కటింగ్స్‌ ఉంటే ఆమెకు చివరికి ఏమీ మిగలదేమో” అని ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు.ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube