శశికళ జైలు నుంచి విడుదల..!!- Shashikala Released From Jail

Sasi kala,Tamilnadu,Rajinikanth,Benguluru. - Telugu Benguluru., Rajinikanth, Sasi Kala, Tamilnadu

తమిళనాడు రాజకీయాలలో పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి.మొదటిలో రజినీకాంత్ పార్టీ పెడతారని అందరూ భావించిన సమయంలో ఒక్కసారిగా ఆయన పొలిటికల్ ఎంట్రీ నుండి వెనక్కి తగ్గటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించక తాజాగా అన్నాడీఎంకే బహిష్కతనేత శశికళ జైలు నుంచి విడుదల కావడం సంచలనం సృష్టించింది.

 Shashikala Released From Jail-TeluguStop.com

అవినీతి కేసులో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు శశికళ జైలు శిక్ష అనుభవించటం జరిగింది.

ఈ శిక్ష నేటితో పూర్తి కావటంతో ఆమె కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడి బెంగళూరు విక్టోరియా హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో ఆమె విడుదలకు సంబంధించిన కార్యక్రమాలు ఆస్పత్రి వర్గాలు చకచకా పూర్తి చేస్తూ ఉన్నాయి.ఇప్పటికే శశికళ మద్దతుదారులు జైలు నుంచి ఆమెను విడుదల చేసేందుకు 10 కోట్ల జరిమానా చెల్లించటం అందరికీ తెలిసిందే.

దీంతో జైలు శిక్ష పూర్తవడంతో మరోపక్క వైద్యులు ఆమె ఆరోగ్యం పట్ల డిశ్చార్జి నిర్ణయం ఆమె బంధువులకు తెలపడం జరిగింది.ఈనేపథ్యంలో మరికొద్ది గడియలో శశికళ జైలు నుండి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదిలా ఉంటే మరోపక్క మరో పది రోజుల పాటు ఆమె ఆరోగ్యం కుదుట పడటానికి టైం పడుతుందని వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనా త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ విడుదల తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఇదిలా ఉంటే మరో పక్క ఆమె విడుదలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో జైలు అధికారులు నిమగ్నమై ఉన్నారు.

ఇదే తరుణంలో శశికళ తరపున లాయర్ కేంద్ర హోంశాఖ ఈ ఆమె భద్రతకు సంబంధించి లెటర్ రాయడం సంచలనంగా మారింది.

.

#Benguluru. #Sasi Kala #Rajinikanth #Tamilnadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు