శర్వాకు ఆ స్టామినా ఉంది... డౌటక్కర్లేదు బాసు

సాదాసీదాగా తెరకెక్కి కోళీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘96’ చిత్రం గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఘాటు చర్చలు జరుగుతున్నాయి.ఈ చిత్రంలో హీరోగా నటించడానికి హీరో నాని, అల్లు అర్జున్‌, గోపిచంద్‌ల పేర్లు వినిపించాంయి.

 Sharwanand Wants To Remake Of 96 Movie-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో హీరో మద్యవయస్కుడి పాత్రలో కనిపించాల్సి ఉంది.దాంతో హీరోలు కాస్త అటుఇటుగా ఆలోచన చేస్తున్నారు.

దాంతో ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత దిల్‌రాజు యంగ్‌హీరో శర్వానంద్‌ తలుపు తట్టాడు.

‘96’ చిత్రంలో నటించడానికి శర్వా కూడా ఒకే చేసినట్టు ఇటీవల ‘పడి పడి లేచే మనసు’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు.హీరో మద్యవయస్కుడి పాత్ర అయినా కూడా తనకు సెట్‌ అవుతుందని భావించిన శర్వా అందుకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.ఈ చిత్రంలో శర్వా నటించడం వల్ల నిర్మాతకు ఇక డౌటే అవసరం లేదు అని ఈ యంగ్‌ హీరో అభిమానుల అభిప్రాయం.

విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ పక్కింటి కుర్రాడిగా కనిపించే శర్వా ఈ చిత్రానికి ప్లస్‌ అవుతాడని టాక్‌ వినిపిస్తోంది.

అంతేకాకుండా గతంలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రంలో మద్య వయస్కుడి పాత్రలో నటించి, మంచి మార్కులు సొంతం చేసుకున్న శర్వా ఈ చిత్రంలో కూడా బాగా సెట్‌ అవుతాడు.ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతాడు.ఇక ఒకసారి అలా మద్యవయస్కుడిగా కనిపించాడు కాబట్టి ‘96’ లో కూడా ఆ పాత్ర డీల్‌ చేసే స్టామినా ఉంది.

కాబట్టి హీరో ఎలా సెట్‌ అవుతాడు అనేది డౌట్‌ కూడా అక్కర లేదు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube