ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతుంది.అప్పట్లో కేసీఆర్ నేనే గద్దెదించుతా.
నేనే ఆయనకు గట్టి పోటీ ఇస్తా.తెలంగాణలో అది చేస్తా ఇది చేస్తా అంటూ ఎన్నో మాటలు చెప్పింది వైయస్ రాజశేఖర్ బిడ్డ షర్మిల( YS Sharmila ) కానీ చివరికి ఏది చేయలేక మూటముల్లె సర్దుకొని తన రాజ్యానికి వెళ్ళింది అంటూ చాలామంది ఈమెపై సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఎన్నికలు దగ్గర పడిన సమయంలో కాంగ్రెస్ లో నా పార్టీని విలీనం చేస్తానని బల్ల గుద్ది చెప్పింది షర్మిలక్క.అంతేకాదు పార్టీ అధినాయకత్వాన్ని కలిసి ఎన్నో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
చివరికి కాంగ్రెస్ ( Congress ) వాళ్లు షర్మిలను తమ పార్టీలో చేర్చుకుంటే నష్టం తప్ప లాభం లేదు అని గ్రహించి తమ పార్టీలో విలీనం చేసుకోలేదు.

దీంతో కాంగ్రెస్ మీద కక్ష కట్టి నేను 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతా కాంగ్రెస్ ని ఓడిస్తా అంటూ ఇలా ఎన్నో మాటలు మాట్లాడింది.చివరకు ఏది చేయలేక కనీసం నియోజకవర్గానికి ఒక్క అభ్యర్థి కూడా ఈమె తరపున నిలబడడానికి రాలేదు.దాంతో పార్టీని విలీనం చేయించుకోకపోయినా పర్వాలేదు అని,నేను కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తా అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కి మద్దతిస్తానంటూ షర్మిలక్క చెప్పిన మాటలు ఉత్తుత్తే అని అందరూ మాట్లాడుకుంటున్నారు.ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ కి నేను మద్దతిస్తాను అని చెప్పింది.

తీరా చివరికి చూస్తే ఒక్క కాంగ్రెస్ మీటింగ్ లో కూడా ఈమె కనిపించడం లేదు.ఎన్నికలు మరో వారం రోజులు కూడా లేని తరుణంలో ఒక్క బహిరంగ సభలో కూడా షర్మిలక్క కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి రాలేదు.దీంతో కాంగ్రెస్ కి మద్దతు అంటూ షర్మిలక్క చెప్పిన మాటలు ఉత్తిత్తివేనా అని పలువురు మాట్లాడుకుంటున్నారు.షర్మిలక్క మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన పాత్ర పోషించిన కోదండరాం( Kodandaram ) కూడా కాంగ్రెస్ కే తన మద్దతు అంటూ చెప్పారు.
ఇక ఈయన కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ కు సంబంధించిన ఏ సభలో కూడా కనిపించడం లేదు.ప్రచారం చేయడం లేదు.దీంతో కాంగ్రెస్ కి మద్దతిస్తామంటూ వీరు చెబుతున్న మాటలు ఉత్తిత్తివే అని జనాలు మాట్లాడుకుంటున్నారు.మరి షర్మిలక్క కాంగ్రెస్ కి మద్దతి ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి ఎందుకు ప్రచారం చేయడం లేదు.
బీఆర్ఎస్( BRS ) , బీజేపీ తో ఏమైనా చేతులు కలిపిందా అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.