వైఎస్సార్ తెలంగాణ ( YSR Telangana party )పేరుతో పార్టీ స్థాపించిన షర్మిల ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS party )ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ, తమ పట్టు పంచుకునే ప్రయత్నం చేస్తోంది.ఎన్ని చేసినా ఆశించిన స్థాయిలో అయితే ఆ పార్టీలో చేరికలు కనిపించడం లేదు.
ముఖ్యంగా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా తనకు అండదండలు అందిస్తుందని షర్మిల భావించినా, ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు.మొదట్లో చేరిన నేతలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు.
దీంతో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా, షర్మిల ( YS Sharmila )మాత్రం అవేమీ పట్టించుకోకుండానే పాదయాత్రలు, సభలు, సమావేశాల పేరుతో హడావుడి చేస్తూనే ఉన్నారు.ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లు పైగా తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు.
బీఆర్ఎస్ కార్యకర్తల దాడులను ఎదుర్కొన్నారు.ఏదో ఒక అంశంపై నిత్యం మీడియాలో వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు.
అయిన షర్మిల పార్టీకి ఆశించిన స్థాయిలో అయితే మైలేజ్ రాలేదనేది వాస్తవం.

ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి తానే అంటూ షర్మిల ధీమా వ్యక్తం చేశారు.దీనికి ఒక లాజిక్ ను కూడా ఆమె చెప్పారు.
ఇప్పటి వరకు తెలంగాణలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పోటీ చేశాయని, కానీ ఈ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించి బిఆర్ఎస్ కు పట్టం కట్టారని అన్నారు.దీనికి కారణం బీఆర్ఎస్ కు బిజెపి, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు అనే ప్రజలు తిరస్కరించారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ టిపి పోటీ చేస్తుందని, ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీఆర్ ఎస్ , కాంగ్రెస్ కలిసే పనిచేస్తాయని ప్రకటించారు అని షర్మిల గుర్తు చేశారు.ఈ పార్టీలన్నీ ఎన్నికల సమయంలో వైరం నటిస్తున్నాయని షర్మిల విమర్శించారు.

ఇవన్నీ పక్కనపెడితే తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్న షర్మిల అసలు తమ పార్టీని బలోపేతం చేయడం పైనా , చేరికలను ప్రోత్సహించడం పైన అంతగా దృష్టిపెట్టడం లేదు.అలాగే ఇతర పార్టీలలోని అసంతృప్త నాయకులూ, పార్టీ మారాలని చూస్తున్న వారు ఎవరూ వైఎస్సార్ టీపీ ని ప్రత్యామ్నాయంగా చూడడమే లేదు.అసలు ఇప్పుడు పార్టీలో ఉన్న కొద్దో గొప్పో నాయకులకు ఆమె సరైన భరోసా ఇవ్వలేకపోతున్నారు.అయినా షర్మిల మాత్రం తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ ధీమాగా ప్రకటనలు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







