సోషల్ మీడియాలో నిరంతరం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలో ప్రపంచంలోని ఏ మూలన ఏ చిన్న ఆసక్తికరమైన విషయం జరిగినా వెంటనే నెట్టింట ప్రత్యక్షమైపోతుంది.
అలా క్షణాల్లో సోషల్ మీడియాలో ఎన్నో వేల సంఖ్యలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా ఓ కుందేలు, కోడి పుంజుకి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా మీరు కోడి పందేలు, పొటేలు పందేలు( Chicken race, ram race ) చూసి వుంటారు.అయితే ఇక్కడ మీరు కుందేలు, కోడిపుంజు ఫైట్ చూడవచ్చు.

అవును, ఇవి తమ శక్తియుక్తులను మరిచి మరీ ఒకదానిపై మరొకటి పడి మరీ కొట్టుకుంటున్నాయి.అయితే ఈ రెండింటిలో ఎవరు విజయం సాధించారో తెలియదు కానీ వీడియోను చూసిన నెటిజన్లు అయితే కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నారు.దాంతో ఉండబట్టలేక రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో మీరు పరస్పరం పోటీ పడుతూ కొట్టుకుంటున్న కుందేలు, కోడి పుంజును( Rabbit , chicken ) చాలా స్పష్టంగా చూడవచ్చు.
కాగా ఈ వీడియోకు ఇప్పటివరకు 73 వేల లైకులు, 8 లక్షల 88 వేలకు పైగా వీక్షణలు రావడం విశేషం.

వీడియోను చూసిన నెటిజన్లు అయితే చాలా రకాలుగా స్పందించడం ఇక్కడ చూడవచ్చు.కొందరు “ఇది పోకీమాన్‌లో మాత్రమే సాధ్యం.కానీ ఎలా ఇప్పుడు?” అంటూ కామెంట్స్ చేస్తే, మరికొందరు మాత్రం “ఈ ఫైట్‌లో ఎవరు గెలిచారు.గెలిచినందుకు ఏం వచ్చింది? అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.మీరు కూడా ఇక్కడ వున్న వీడియోని చూసి మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.







