షర్మిల బస్సు యాత్ర .. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.ఏపీలో  టిడిపి ,జనసేన, బిజెపి కూటమి గా ఏర్పడి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడం,  అలాగే ఏపీ అధికార పార్టీ వైసిపి ఇప్పటికే జనాల్లోకి వెళుతూ ఉండడంతో, కాంగ్రెస్ ను  క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ప్రజల్లో కాంగ్రెస్ పై ఆదరణ పెంచే విధంగా షర్మిల వ్యవహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

 Sharmila's Bus Trip From Where To Where, Ap Congress, Pcc Chief, Sharmila, Ap Co-TeluguStop.com

  దీనిలో భాగంగానే రాష్ట్రమంతట బస్సు యాత్ర( bus trip ) నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు.ఈ మేరకు కడప జిల్లా నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Telugu Ap Congress, Ap, Chandrababu, Congressmla, Congressmp, Jagan, Pavan Kalya

 ఈనెల 5 నుంచి ఏఐసిసి అధ్యక్షురాలు షర్మిల బస్సు యాత్ర మొదలవుతుంది.కడప జిల్లాలో ఎనిమిది రోజులపాటు బస్సు యాత్ర చేపట్టనున్నారు.జిల్లాలోని అన్ని మండలాల ప్రజలతో మమేకం అయ్యే విధంగా షెడ్యూల్ ను షర్మిల సిద్ధం చేసుకుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కడప  ఈ జిల్లా తరువాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ఆమె రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నారు.కాంగ్రెస్( Congress ) అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత, ఆయా నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి బస్సు యాత్ర చేపట్టాలనే దిశగా షర్మిల నిర్ణయం తీసుకున్నారు.

Telugu Ap Congress, Ap, Chandrababu, Congressmla, Congressmp, Jagan, Pavan Kalya

షర్మిల కడప జిల్లా  యాత్ర షెడ్యూల్ ను ఒకసారి పరిశీలిస్తే.5 వ తేదీన కాశీ నాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి కోడూరు, గోపవరం.6 వ తేదీ బద్వేల్, అట్లూరు, కడప.7 న దువ్వూరు చాపాడు కాజీపేట మైదుకూరు బి మఠం.8 న కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకమ్మదిన్నే,  పెండ్లిమర్రి, వేరపు నాయిని పల్లి.10 న చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల.11 న తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం.12న జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube