తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎన్నో అంచనాలతో వచ్చి సంచలనం రేపుతోంది.ఆమె ఎవరిమీద ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో ఎవరికీ అర్థం కాదు.
ఇక ఇదే క్రమంలో ఆమెకు పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఎదురవుతున్న సవాల్ హుజూరాబాద్ ఉప ఎన్నిక.ఇక దీనిపై ఆమె ఇప్పటి దాకా ఎలాంటి ప్లాన్ చేసుకోలేదనే చెప్పాలి.
ఎందుకంటే ఆమె వచ్చిందో మొన్న కాబట్టి అప్పుడే ఎన్నికల్లో పోటీ చేసేంత స్థాయి ఆమె పార్టీకి లేదనే విషయం అర్థమవుతోంది.
కాగా దీన్ని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అసలు ఒక పొలిటికల్ పార్టీ లక్ష్యం ఏదైనా అది ఎన్నికలతోనే ముడిపడి ఉంటుంది.ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మెప్పు పొందితేనే దానికి భవిష్యత్ ఉంటుంది.
ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలు చేసే పది ఇదే అని చెప్పాలి.ఎందుకంటే ఎన్నికల్లో గెలిస్తేనే ప్రజలను మెప్పించిన పార్టీగా గుర్తింపు పొందుతుంది.
అయితే అన్ని పార్టీలది ఒకదారి అయితే నాది రహదారి అన్నట్టు వైఎస్ షర్మిల హుజూరాబాద్ ఉప ఎన్నికల మీద తనను తానే సమర్థించుకుని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వీలు కుదిరినప్పుడల్లా తెలంగాణలోని ప్రతిపక్ష, అధికార పార్టీలపై సంచలన కామెంట్లు చేస్తున్న వైఎస్ ఆర్ బిడ్డ షర్మిల ఎన్నికలు అనే సరికి మాత్రం భయపడి కనీసం పోటీ కూడా చేయకుండానే అనవసర కారణాలు అన్నీ చెబుతోంది.తనకు తానే ఓ కండీషన్లు పెట్టుకుని మరీ వాటిని ప్రజల మీద రుద్దు తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలతో తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం ఉందా అంటూ ప్రవ్నిస్తున్నారు.
తాము అస్సలు పోటీచేయమని, దీని వల్ల ఏ ఒక్కరికీ ఉపయోగం లేదని చెబుతున్నారు.మొత్తానికి షర్మిల మాటల వరకే గానీ చేతల వరకు కాదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.