వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS sharmila ) కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.ఈ నెల నాలుగో తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు.ఈ తతంగం ముగిసిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల పేరును ప్రకటించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది.
దీంతో షర్మిల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో, షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆ పార్టీకి కలిసి వచ్చేది ఎంత ? అధికార పార్టీ వైసీపీకి జరిగే నష్టం ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు జగన్ స్థాయిలోనే వ్యక్తిగత ఇమేజ్ ఉండడం, రాయలసీమ ప్రాంతంలో షర్మిలకు పట్టు ఉండడం, మంచి వాక్చాతుర్యం ఇవన్నీ కలిసి వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.టిడిపి, జనసేన సైతం షర్మిల కాంగ్రెస్ లో చేరితే జగన్ ను రాజకీయంగాను, వ్యక్తిగతంగాను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటుందని, తాము జగన్ పై చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతుందని, అంతిమంగా జగన్ కు రాజకీయంగాను వ్యక్తిగతంగా నూ జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు .అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరికను వైసిపి అంతగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం షర్మిల తన కుమారుడు వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు.నిన్ననే ఇడుపులపాయ కు వెళ్లారు.ఈరోజు నేరుగా జగన్( YS jagan ) ను కలిసి కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికను అందించనున్నారు.
ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి రేపు కాంగ్రెస్ లో చేరనన్నారు.అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరినా.తన అన్నకు వ్యతిరేకంగా పనిచేస్తారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.తెలంగాణ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్ గా ఉండగానే ఎన్నికల సమయంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేసినా.
కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు.ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిలను యాక్టివ్ చేయాలని చూస్తున్నారు.
అయితే కాంగ్రెస్ లోకి షర్మిల వెళ్లినా వైసీపీకి పెద్దగా నష్టం ఉండదని, టిడిపి, జనసేన కూటమికి ఎక్కువ నష్టమని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసిపి ( YCP )ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ఎంతగా చీల్చితే అంతగా వైసీపీకి లాభం.బిజెపి ,టిడిపి, జనసేన కూతమిగా ఏర్పడితే కాంగ్రెస్, వామపక్షాలు ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది.దీంతో వీరంతా వైసీపీకి వ్యతిరేకంగానే జనాల్లోకి వెళ్లి విమర్శలు చేసినా వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును ఈ రెండు కూటములు చీల్చుతాయి.
దీంతో వైసీపీకి అది మేలే చేస్తుంది.అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతోనే టీడీపీ, జనసేనలు( TDP ,Janasenas ) పొత్తు పెట్టుకున్నాయి.కానీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో ఎంత యాక్టివ్ అయినా, జగన్ కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు మాత్రమే తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది.అంటే టిడిపి, జనసేన కూటమికి వెళ్లాల్సిన ఓట్లలో కొన్ని కాంగ్రెస్ వైపు డైవర్ట్ అవుతాయి.
అలాగే వైసిపి లోని అసంతృప్త నాయకులు పార్టీ మారాలన్నా ఇప్పటివరకు వారికి టిడిపి, జనసేన, బిజెపిలో మాత్రమే ఆప్షన్ గా ఉన్నాయి.కానీ ఇప్పుడు షర్మిల ద్వారా వారిలో కొంతమంది అయినా కాంగ్రెస్ వైపు వస్తారు.
అదే జరిగితే జగన్ నెత్తిన పాలు పోసినట్టే.