జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో శాంతి స్వరూప్ ఒకరు కాగా శాంతి స్వరూప్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.శాంతి స్వరూప్( Shanti swaroop , ) కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
మదర్స్ డే( Mothers Day ) సందర్భంగా ఈ ఈవెంట్ ప్రసారం కానుండగా ఈ నెల 14వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఈ ఎపిసోడ్ కు రాశి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
ప్రోమోలో మానస్ విష్ణుప్రియ( Vishnupriya )తో మాట్లాడుతూ ఈరోజు మదర్స్ డే కదా.మీ అమ్మను ఎంత మిస్ అవుతున్నావో నాకు తెలుసు.అంటూ చెప్పుకొచ్చారు.అందుకోసమే మన ఆర్టిస్టులు అందరినీ వాళ్ల ఫ్యామిలీలతో పాటు ఇక్కడికి గెట్ టుగెథర్ లాగా నీకోసం అని ఆర్గనైజ్ చేశానని మానస్ కామెంట్ చేశారు.
హ్యాపీ మదర్స్ డే విష్ణుప్రియ అంటూ మానస్ చెప్పుకొచ్చారు.
బుల్లెట్ భాస్కర్ తన తల్లికి బంగారు గొలుసు ఇవ్వగా ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇలాంటి కొడుకు పుట్టాడని చెప్పుకొచ్చారు.శాంతి స్వరూప్ మాట్లాడుతూ మా అమ్మ ఇళ్లలో పాచిపని చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.పరేషాన్ బాయ్స్ బబ్లూ తల్లి మాట్లాడుతూ వాడు నా కొడుకుగా పుట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
విష్ణుప్రియ తన తల్లి గురించి మాట్లాడుతూ ఎంత అడిగినా మా అమ్మ రాదని అన్నారు.అమ్మా.ఐ లవ్ యూ.ఐ మిస్ యూ అంటూ విష్ణుప్రియ ఎమోషనల్ కావడం గమనార్హం.ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ఈ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.