ఆగష్టులో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) భోళా శంకర్ సినిమాతో వస్తున్నాడు.ఆల్రెడీ ఆయన శంకర్ దాదా ఎం.
బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు చేశారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గుండుంబా శంకర్ సినిమా చేశాడు.
ఇక వీరిద్దరి తర్వాత మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా శంకర్ సెంటిమెంట్ ని కొనసాగిస్తాడు.సంపత్ నందిని డైరెక్షన్ లో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమాకు గాంజా శంకర్( Ganja Shankar ) అని టైటిల్ ఫిక్స్ చేశారట.
శంకర్ సెంటిమెంట్ మెగా హీరోలకు కలిసి వస్తుందన్న నమ్మకంతోనే సాయి తేజ్ సినిమాకు గాంజా శంకర్ అని పెట్టినట్టు చెప్పుకుంటున్నారు.చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నంది సీటీమార్ తర్వాత సాయి తేజ్ తో మరో మాస్ సినిమాతో వస్తున్నాడు.
సినిమాకు గాంజా శంకర్ అని టైటిల్ పెట్టడమే సినిమాకు మంచి మాస్ అప్పీల్ వచ్చేలా చేసింది.మరి గాంజా శంకర్ కథ కామీషు ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.
ఈ సినిమా మాత్రం సాయి తేజ్ నుంచి వస్తున్న మాస్ సినిమాగా చెప్పుకోవచ్చు.