Hair Care Tips: వీటిని కలిపి షాంపూ చేసుకుంటే జుట్టు రాలమన్న రాలదు.. తెలుసా?

సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది.

ఎంత ఖరీదైన హెయిర్ ఆయిల్ మరియు షాంపూలను వాడినప్పటికీ జుట్టు రాలడం అనేది అస్సలు కంట్రోల్ అవ్వదు.

దాంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా మధన పడిపోతుంటారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నీ ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఇంగ్రిడియంట్స్ మీ షాంపులో కలిపి వాడితే క‌నుక జుట్టు రాలమన్న రాల‌దు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఇంగ్రిడియంట్స్ ఏంటో.

వాటి ఎలా వినియోగించాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు గంజి, నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ వేసి అన్ని క‌లిసేంత వ‌ర‌కు బాగా మిక్స్ చేయాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని యూస్ చేసి జుట్టును శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

అయితే ఈ విధంగా షాంపూ చేయడానికి కనీసం రెండు గంటల ముందు గోరు వెచ్చని కొబ్బరి నూనె లేదా బాదం నూనెను తలకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.ఆపై పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.చుండ్రు సమస్య ఉంటే క‌నుక‌ దూరం అవుతుంది.

అదే సమయంలో జుట్టు షైనీ గా మరియు సిల్కీగా సైతం మారుతాయి.కాబట్టి, హెయిర్ ఫాల్ తో స‌త‌మ‌తం అయ్యే వారు తప్పకుండా మీ రెగ్యుల‌ర్ షాంపూలో పైన చెప్పిన మ్యాజికల్ ఇంగ్రిడియంట్స్ ను కలిపి వాడేందుకు ప్రయత్నించండి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు