శమంతకమణి రివ్యూ

చిత్రం : శమంతకమణి
బ్యానర్ : భవ్య క్రియేషన్స్
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత : వి.ఆనంద్ ప్రసాద్
సంగీతం : మణిశర్మ
విడుదల తేది : జులై 14, 2017
నటీనటులు : సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, రాజేంద్రప్రసాద్ తదితరులు

 Shamantakamani Review-TeluguStop.com

తెలుగులో మల్టిస్టారర్ ట్రెండ్ ఇప్పటికే పూర్తి స్వింగ్ లో లేదు.అందులోనూ నలుగురేసి హీరోలున్న సినిమా చివరిసారి ఎప్పుడు విడుదల అయ్యిందో మనకు గుర్తు లేదు.అందుకే కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతూ సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది లాంటి యువహీరోలు శమంతకమణి అనే ట్రెండి సినిమా చేసారు.

కథలోకి వెళితే :

అయిదుగురు వ్యక్తులు, అయిదు కోట్లు విలువ చేసే ఓ కారు కథ ఇది.ఆ అయిదుగురు వ్యక్తులు, కృష్ణ (సుధీర్ బాబు), తల్లిని పోగొట్టుకొని, కోటీశ్వరుడు అయిన తండ్రితో సరైన సంబంధాలు లేకుండా ఉంటాడు, శివ (సందీప్ కిషన్)ని ప్రేమించిన అమ్మాయి వదిలేస్తుంది, కార్తిక్ (ఆది) ఆస్తిపరురాలైన గర్ల్ ఫ్రెండ్ తో ఎలా ఉండాలో తెలియని వాడు, అమెరికా వెళ్ళడం ఇతని కల.నాలుగు మహేష్ బాబు (రాజేంద్రప్రసాద్) తను ప్రేమిస్తున్న మహిళ (ఇంద్రజ) ని సుఖంగా చూసుకోవడం ఇతనికి కావాల్సింది.ఇక అయిదోవ వ్యక్తీ రంజిత్ కుమార్ (నారా రోహిత్).

ఇతను డబ్బుకి ఆశపడే పోలీస్.

ఆ అయిదు కోట్ల కారు శమంతకమణికి కృష్ణ యజమాని.

ఒక పార్టీకి కారు తీసుకొని వెళితే అది చోరి అయిపోతుంది.విషయం ఏమిటంటే, అప్పుడు ఆ పార్టి జరుగుతున్న హోటల్ లో శివ, మహేష్, కార్తిక్ కూడా ఉంటారు.

ఇక హోటల్ బయటే రంజిత్ కుమార్ ఉంటాడు.ఇప్పుడు కారు ఎవరు కొట్టేసింది ఎవరో తెలియని పరిస్థితి.

ఈ కథలో కృష్ణకి తప్ప, అందరికి డబ్బు అవసరం.మరి ఈ అయిదుగురిలో కారు కొట్టేసింది ఎవరు ? ఆసక్తికరమైన ఈ కథకి ముగింపు థియేటర్ లో చూడండి.

నటీనటుల నటన :

సుధీర్ బాబు ఒక్కడే ఈ గ్యాంగ్ లో తేడా.అందరి నవ్విస్తే సుధీర్ మాత్రం ఎమోషనల్ చేస్తాడు.

నిజానికి ఇలాంటి కథలో టోన్ కి పూర్తి వ్యతిరేకమైన పాత్ర ఎన్నుకోవాలంటే గట్స్ ఉండాలి.క్లయిమాక్స్ కి ముందు వచ్చే ఎపిసోడ్ లో సుధీర్ నటన విపరీతంగా ఆకట్టుకుంటుంది.

లుక్స్ పరంగా అడిరిపోయాడు.సందీప్ కిషన్ బాగా నవ్విస్తాడు.

తన పాత్రకి మంచి మాస్ టచ్ ని ఇచ్చారు.నారా రోహిత్ ఎప్పటిలాగే తనకు మాత్రమే సాధ్యపడే వాయిస్ మాడ్యులేషన్ తో మెప్పించాడు.

ఆదికి ఈ సినిమా పెద్ద రిలీఫ్.మూసలోంచి బయటపడ్డాడు.ఇక రాజేంద్రప్రసాద్ షరామామూలే.

టెక్నికల్ టీం :

మణిశర్మ మ్యూజిక్ అదుర్స్.ఇది ఓ పెద్ద మాస్ హీరో ఉన్న మసాలా సినిమా కాదు.మణిశర్మ ఈమధ్య రెగ్యులర్ గా సినిమాలు కూడా చెయ్యట్లేదు.అయినా ఇంత ట్రెండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం మామూలు విషయం కాదు.సినిమాటోగ్రాఫీ అద్భుతంగా ఉంది.

కేవలం కెమెరా ట్రిక్స్ మీదే ఆధారపడకుండా సెట్లోనే నేచురల్ కలర్స్ బాగా వాడారు.ఎడిటింగ్ మీద ఫస్టాఫ్ లో కంప్లయింట్స్ ఉండొచ్చు కాని సెకండ్ హాఫ్ లో అలాంటి లోటుపాట్లు ఏమి ఉండవు.నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

శమంతకమణి అనే విలువైన కారు పోవడంతో మొదలవుతుంది కథ.ఆ తరువాత అయిదుగురు పాత్రల పరిచయం.నారా రోహిత్ కి తప్ప అందరికి కష్టాలే.

సుధీర్ బాబుకి తప్ప అందరికి డబ్బు అవసరమే.ఇలా అందరి కథలు చెప్పటంలోనే ఫస్టాఫ్ అంతా సాగిపోతూ ఉంటుంది.

ఎక్కడో చిన్న అనుమానం, ట్రైలర్ లో కనిపించనంత గ్రిప్పింగ్ గా సినిమా ఉండదేమో అని.అలాగని ఫస్టాఫ్ బోర్ కొట్టదు.కాని కారు పోయిన విచారణ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో మొదలువుతుందో, అక్కడినుంచి అసలు కథ మొదలవుతుంది.చాలా గ్రిప్పింగ్ గా, కథలో భాగంగా వచ్చే హానెస్ట్ హాస్యంతో రెసిగా వెళ్ళిపోతుంది.

దర్శకుడు శ్రీరాం ఆదిత్య ఈ కథను అల్లుకున్న తీరు చూస్తే ముచ్చటేస్తుంది.ఇన్నేసి దారాలు ముడేసి, అన్ని క్లయిమాక్స్ లో ప్రేక్షకులకి అర్థమయ్యేలా విప్పుతూ, మళ్ళీ వారిని నవ్వించడం మామూలు విషయం కాదు.

ఆ విషయంలో దర్శకుడు, దర్శకుడితో పాటు నటులంతా సక్సెస్ అయ్యారు.సెకండాఫ్ లో ఎక్కడా కూడా ఒక్క అనవసరమైన సన్నివేశం ఉండదు.

ఓవరాల్ గా చెప్పాలంటే బాగా అలరించే మంచి టైంపాస్ సినిమా.కొత్తరకం ప్లాట్ కాకపోవచ్చు కాని కొత్త రకం కథనం ఈ సినిమా.వీకెండ్ విన్నర్.

చివరగా :

నవ్వులున్నాయి, లాజిక్ ఉండి, థ్రిల్ ఉంది.

ప్లస్ పాయింట్స్ :

* నలుగురు హీరోలు

* టేకింగ్ అండ్ కథనం

* సంగీతం

* సినిమాటోగ్రాఫి

మైనస్ పాయింట్స్ :

* ఫస్టాఫ్ లో పెద్దగా పేస్ లేదు

తెలుగుస్టాప్ రేటింగ్ :3.25/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube