యశోద టైం లో సమంత ( Samantha )అనారోగ్యం కారణంగా కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి సినిమా రిలీజ్ చేశారు.అయితే సమంత ఫ్యాన్స్ యశోద సినిమాను ఆదరించారు.
సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది.ఇక త్వరలో సమంత శాకుంతలం సినిమా రిలీజ్ అవుతుంది.
గుణశేఖర్ ( Gunasekhar )డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో లీడ్ రోల్ లో నటించింది సమంత.ఈ సినిమా విషయంలో సమంత సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉంది.
అంతేకాదు శాకుంతలం సినిమా ప్రమోషన్స్ బాధ్యత అంతా తన మీద వేసుకుంది సమంత.
శాకుంతలం( Sakunthalam ) సినిమాకు పర్సనల్ గా కనెక్ట్ అయిన సమంత ఆ సినిమాకు పూర్తి సహకారం అందించాలని ఫిక్స్ అయ్యింది.అంతేకాదు తన మార్కెట్ పెంచుకునే విధంగా ఉన్న ఈ సినిమాని ప్రమోట్ చేస్తే మరిన్ని ఇలాంటి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.యశోద సినిమా ఇంటర్వ్యూ టైం లో చాలా నీరసంగా కనిపించిన సమంత శాకుంతలం ఇంటర్వ్యూస్ లో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.
అంతేకాదు ఆమెలో మునుపటి జోష్ అందరికి కనిపిస్తుంది.మొత్తానికి సమంత తిరిగి ఫాం లోకి రావడం ఆమె ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.