బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) ఇటీవల పఠాన్ సినిమా( Pathan )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ పటాన్ సినిమా బాలీవుడ్ కి చాలా గ్యాప్ తర్వాత ఒక పండుగ వాతావరణం తీసుకువచ్చింది.
అంతేకాకుండా ఈ సినిమా కేజిఎఫ్ బాహుబలి లాంటి రికార్డులను సైతం బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.కాగా షారుఖ్ ఖాన్ ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్నాడు షారుఖ్.

ఇక షారుక్ ఖాన్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భారీగా అభిమానులు ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక స్టార్ క్రికెటర్ కొడుకు కూడా షారుక్ ఖాన్ ఫ్యాన్ గా మారిపోయాడు.అదెలా అంటే.మాజీ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ అయినా ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan )తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోని విడుదల చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పటాన్ సినిమాలోని పాటలు పెట్టగా ఇర్ఫాన్ పఠాన్ తనయుడు ఏడాది వయసున్న చిన్నారి ఆ ఫోన్ ని తీసుకుని క్యూట్ గా ఎగురుతూ డాన్స్ చేయడానికి ప్రయత్నించాడు.కొడుకు డాన్స్ చూసి ఇర్ఫాన్ కూడా మురిసిపోయాడు.కొడుకుని ఎంకరేజ్ చేస్తూ డాన్స్ చేయమని అరుస్తున్నాడు.దీంతో ఆ వీడియోని తీసి ఇర్ఫాన్ పఠాన్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ షారుఖ్ ని ట్యాగ్ చేశాడు ఇర్పాన్.
ఖాన్ సాబ్, నీ లిస్ట్ లో ఇంకో క్యూట్ ఫ్యాన్ యాడ్ అయ్యాడు అని రాసుకొచ్చాడు ఇర్ఫాన్.కాగా ఆ వీడియో పై షారుఖ్ ఖాన్ స్పందిస్తూ.
అతను నీకంటే చాలా ట్యాలెంటు ఉన్నవాడు.లిటిల్ పఠాన్ అంటూ ట్వీట్ చేశాడు.
దాంతో ఈ ట్వీట్ ను అటు షారుఖ్ అభిమానులు, ఇటు ఇర్ఫాన్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.







