బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan ) సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్( Jawan ) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు.ఇందులో నయనతార( Nayanathara ) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) విలన్ గా నటించారు.
ప్రియమణి, దీపికా పదుకొనే.మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ముంబైలో తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )మాట్లాడుతూ.ఒక సినిమా ప్రయాణం కొన్ని కారణాల వల్ల చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉంటుంది.అలాగే జవాన్ సినిమా కూడా గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నామని తెలిపారు.కరోనా కంటే ముందుగానే అట్లీ ఈ సినిమా కథను నాకు తెలియజేశారు అప్పటినుంచి ఈ సినిమా ప్రయాణం కొనసాగుతూనే ఉందని షారుక్ తెలిపారు.
ఇక ఈ సినిమా కోసం చాలామంది సౌత్ సెలబ్రిటీలు పనిచేశారు.అలాగే టెక్నీషియన్స్ కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే.
ఈ సినిమా కోసం కొన్ని నెలల పాటు తమ కుటుంబాలను వదిలి ముంబైలోనే ఉన్నారు.
ఇలా ఈ సినిమా నేడు ఎంతో మంచి సక్సెస్ అయ్యింది అంటే అందుకు కారణం నటీనటులు మాత్రమే కాదని టెక్నీషియన్లు కూడా అని తెలిపారు.ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో ఈ సక్సెస్ సౌత్ ఇండస్ట్రీదే అంటూ ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇలా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా విజయం సౌత్ ఇండస్ట్రీదే అంటూ షారుఖ్ ఖాన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో దర్శకుడుతో సహా హీరోయిన్స్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా సౌత్ వాళ్ళు కావడం విశేషం.