ఏ ముహూర్తం లో ‘సలార్'( Salaar ) చిత్రం లో డైనోసర్ డైలాగ్ పెట్టారో తెలీదు కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ‘సలార్’ అనే డైనోసర్ ని చూసి ఎంత సూపర్ స్టార్ అయినా వెనక్కి వేలాల్సిందే, లేకుంటే ఆహారం అయిపోతారు అన్నట్టుగా తయారు అయ్యింది పరిస్థితి.సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు.
ఈ ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున విడుదల( Salaar Release ) చేస్తామని రీసెంట్ గానే ఒక ఊర మాస్ పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది మూవీ టీం.ఈ ప్రకటన వచ్చిన తర్వాత డిసెంబర్ లో విడుదల అవ్వాల్సిన సినిమాలు సంక్రాంతికి వాయిదా పడ్డాయి.సౌత్ లో సలార్ కి ఎలాంటి పోటీ లేదు.కానీ నార్త్ ఇండియా లో మాత్రం చాలా కష్టమైన పరిస్థితి ఎదురైందనే చెప్పాలి.

ఎందుకంటే డిసెంబర్ 22 వ తారీఖునే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) హీరో గా నటించిన ‘దుంకి’ అనే చిత్రం కూడా విడుదల కాబోతుంది.రీసెంట్ గా ట్విట్టర్ లో అభిమానులతో జరిగిన లైవ్ ఇంటరాక్షన్ లో కూడా షారుఖ్ ఖాన్ మరోసారి ఖరారు చేసాడు.దీంతో నార్త్ ఇండియా లో ‘సలార్’ మరియు ‘దుంకి'( Dunki ) చిత్రాలు నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడుతున్నాయి.కానీ సలార్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ బాలీవుడ్ లో ఇప్పటి నుండే చాలా అగ్రెసివ్ గా థియేటర్స్ ని బుక్ చెయ్యడం మొదలు పెట్టారు.
వాళ్ళ ఊపు చూస్తూ ఉంటే ప్రధాన నగరాల్లో ఒక్క సెంటర్ లో కూడా సింగల్ స్క్రీన్ థియేటర్స్ ని మిగిలించేలా లేరు.మొత్తం ‘సలార్’ చిత్రానికి బుక్ చేసుకుంటున్నారు.
ఇప్పుడు ‘దుంకి’ డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్ద తల నొప్పి ఎదురైంది.అదే రోజు వస్తే కచ్చితంగా నష్టపోతాము అనే సంకేతాలు ‘దుంకి’ మేకర్స్ కి వస్తున్నాయి.
షారుఖ్ స్టార్ స్టార్ డం ప్రస్తుతం మామూలు రేంజ్ లో లేదు.ఈ ఏడాది ఆయన ‘పఠాన్’ మరియు ‘జవాన్'( Jawan ) సినిమాల ద్వారా రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో కి కూడా ప్రభాస్ సొంత గడ్డలో గడగడలాడిస్తున్నాడు అంటే ప్రభాస్ ఇంకెంత పెద్ద సూపర్ స్టార్ అనేది అర్థం చేసుకోవచ్చు.ఫ్లాప్ సినిమాలతోనే వందల కోట్ల రూపాయిలు కొల్లగొట్టే సత్తా ఉన్న ఏకైక సూపర్ స్టార్ ప్రభాస్, ‘సలార్’ చిత్రానికి పొరపాటున పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడాలని ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.