అమెరికాలోని కాలిఫోర్నియాలో ( California ) వున్న ట్రేసీ సిటీలో గురు గ్రంథ్ సాహిబ్ ‘‘పవిత్ర సారూప్స్’’ని( Holy Saroop ) ప్రచురించడానికి ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించాలని సిక్కుల అత్యున్నత నిర్ణాయక బోర్డ్ శిరోమని గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)( SGPC ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది.అలాగే యుబా సిటీలో మత ప్రచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది.
మంగళవారం ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ( Harjinder Singh Dhami ) అధ్యక్షతన జరిగిన ఎస్‌జీపీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇదే సమయంలో హెచ్‌ఎస్‌జీఎంసీ ఎన్నికల కోసం ఓటరు ఫాంలను హిందీలో మాత్రమే ముద్రించడంపై ఎస్‌జీపీసీ మండిపడింది.
ఖట్టర్ ప్రభుత్వం
పంజాబీని విస్మరించేలా
ప్రవర్తిస్తోందని దుయ్యబట్టింది.ఇది పూర్తిగా వివక్షాపూరిత చర్య అని.హర్యానాలో పంజాబీ( Punjabi ) రెండవ భాష అని, పోల్ నిర్వహించే అధికారులు కూడా పంజాబీలో మాట్లాడటం లేదని ధామి అన్నారు.

కాగా.2021 ఆగస్ట్‌లో అప్పటి ఎస్‌జీపీసీ అధ్యక్షురాలు బీబీ జాగీర్ కౌర్( Bibi Jagir Kaur ) అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిక్కు మత పవిత్ర గ్రంథమైన ‘‘ గురు గ్రంథ్ సాహిబ్’’( Guru Granth Sahib ) సారూప్‌ను విదేశాలకు రవాణా చేస్తున్నప్పడు ‘‘మర్యాద’’ (కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘనలను నివారించేందుకు గాను ఈ పవిత్ర గ్రంథాన్ని ముద్రించడానికి విదేశాలలో ప్రింటింగ్ ప్రెస్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ‘‘సరూప్’’లను పంపడానికి ఎస్‌జీపీసీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రధానంగా సిక్కులు( Sikhs ) పెద్ద సంఖ్యలో స్ధిరపడిన అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, కెనడా, న్యూజిలాండ్‌లలో ప్రింటింగ్ ప్రెస్‌లను ఏర్పాటు చేస్తామని కౌర్ వెల్లడించారు.ఈ పని కోసం విదేశీ ‘‘సంగత్’’, గురుద్వారా నిర్వహణ కమిటీల మద్ధతు ఉంటుందని జాగీర్ కౌర్ చెప్పారు.గుజరాత్‌లోని వివిధ గురుద్వారాల కోసం 100 ‘‘సరూప్’’లను పంపాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని.ఎస్‌జీపీసీ ప్రత్యేక బస్సు ద్వారా అక్కడికి ‘‘ సరూప్’’లను చేరవేస్తామని ఆమె తెలిపారు.