అమెరికాలోని కాలిఫోర్నియాలో( California ) సిక్కు మోటార్ సైకిలిస్టులకు( Sikh Motorcyclists ) హెల్మెట్ నుంచి మినహాంపునిచ్చేందుకు బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రపంచవ్యాప్తంగా సిక్కు సంతతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సిక్కులకు అత్యున్నత నిర్ణాయక సంస్థగా వున్న శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)( SGPC ) స్పందించింది.
కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎస్‌జీపీసీ చీఫ్ హర్జిందర్ సింగ్ ధామి స్వాగతించారు.ఇది సానుకూల పరిణామం అన్న ఆయన.ఇకపై అక్కడ సిక్కులను హెల్మెట్ ధరించాల్సిందిగా బలవంతం చేయలేమని వ్యాఖ్యానించారు.
కాగా.
గతవారం మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు సేఫ్టీ హెల్మెట్( Safety Helmet ) ధరించకుండా సిక్కులకు మినహాయింపు ఇచ్చే బిల్లుకు అనుకూలంగా కాలిఫోర్నియా సెనేటర్లు ఓటు వేసిన సంగతి తెలిసిందే.సెనేటర్ బ్రియాన్ డాహ్లే( Senator Brian Dahle ) రూపొందించిన సెనేట్ బిల్లు 847ను రాష్ట్ర సెనేట్ 21-8 ఓట్ల తేడాతో ఆమోదించింది.అనంతరం దీనిని అసెంబ్లీ ఆమోదానికి పంపనున్నారు.2021 అమెరికన్ కమ్యూనిటీ సర్వే అంచనాల ప్రకారం .కాలిఫోర్నియాలో 2,11,000 మంది సిక్కులు నివసిస్తున్నారు.ఇది అమెరికాలో నివసిస్తున్న మొత్తం సిక్కుల్లో సగం భాగం పైనే.
ప్రస్తుతం తలపాగా, పట్కాకు సరిపోయే హెల్మెట్ మార్కెట్‌లో అందుబాటులో లేదని సిక్కు కమ్యూనిటీ సభ్యులు తెలిపారు.కానీ తలపాగా మనిషి తలకు తగిన రక్షణ కల్పిస్తుందని వారు సెనేట్‌కు తెలియజేశారు.బిల్లుకు మద్ధతు పలికిన వారిలో లెజెండరీ సిక్కు రైడర్స్, సిక్కు లెజెండ్స్ ఆఫ్ అమెరికా, సిక్కు సెయింట్స్ మోటార్ సైకిల్ క్లబ్ వున్నాయి.
అమెరికాలో 18 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీలు.
రైడర్లందరీకి హెల్మెట్‌ను తప్పనిసరి చేశాయి.అయితే 29 రాష్ట్రాలు మాత్రం చట్టం రైడర్‌గా (18 , 21 ఏళ్లు దాటిన వారు) గుర్తించిన వారికి హెల్మెట్‌ను తప్పనిసరి చేశాయి.
కానీ ఇల్లినాయిస్, అయోవా, న్యూహాంప్‌షైర్‌లలో మాత్రం ప్రత్యేకించి హెల్మెట్ చట్టాలు లేవు.అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.2020లో 5,500 మందికిపైగా మోటార్ సైకిలిస్టులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా.1,80,000 మందికి తీవ్రంగా గాయపడ్డారు.
అయితే సిక్కులు హెల్మెట్ ధరించాలా , వద్దా అనే ప్రశ్న కెనడా, యూకే వంటి దేశాల్లోనూ విస్తృతంగా చర్చలో వుంది.కెనడాలోని అల్బెర్టా, బ్రిటీష్ కొలంబియా, మానిటోబా, అంటారియో ప్రావిన్సుల్లో సిక్కులకు మోటార్ సైకిల్ హెల్మెట్ చట్టాల నుంచి మినహాయింపు లభించింది.ఇటీవల అక్కడి సస్కట్చేవాన్ ప్రావిన్స్ ప్రభుత్వం సిక్కు మోటార్ సైకిలిస్టులకు ఛారిటీ రైడ్‌ల వంటి ప్రత్యేక కార్యక్రమాల సమయంలో హెల్మెట్ ధరించకుండా తాత్కాలిక మినహాయింపునిచ్చింది.బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌కు చెందిన లెజెండరీ సిక్కు రైడర్స్ అనే మోటార్ సైకిల్ గ్రూప్.
ధార్మిక కార్యక్రమాల కోసం డబ్బును సేకరించడానికి కెనడా అంతటా ప్రయాణించనుంది.ఈ క్రమంలోనే ఈ గ్రూప్ అభ్యర్ధన మేరకు సస్కట్చేవాన్ ప్రావిన్స్ హెల్మెట్ విషయంలో మినహాయింపునిచ్చింది.