రఘునాధపాలెం బీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు ఈరోజు మధ్యాహ్నం యశ్వంత్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పై సాంబారపడి తీవ్ర గాయాలతో కాళీ ఎక్కడికక్కడికి గాయాలైనాయి.వార్త తెలుసుకున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆసుపత్రికి వెళ్లి అబ్బాయిని పరామర్శించి వెంటనే కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
యశ్వంత్ కు మెరుగైన వైద్యం అందించాలని ఘటనకు కారకులైన బాధ్యులను సస్పెండ్ చేయాలని నిరసన రాస్తారోకో చేయటం జరిగింది ఈ నిరసన రాస్తారోకోని ఉద్దేశించి విద్యార్థి యువజన నాయకులు మాట్లాదుతు స్థానిక బీసీ వెల్ఫేర్ ఆర్ సి ఓ జ్యోతి మేడం నిర్లక్ష్యం వలన విద్యార్థులుకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేయిస్తూ విద్యార్థులను పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి గురుకుల పాఠశాలలో ఉందని తక్షణమే విద్యార్థులపై పనిచేపిస్తున్నటువంటి ఆర్సిఓ కావచ్చు అక్కడున్నటువంటి ప్రిన్సిపాల్ మల్లయ్య గారు కావచ్చు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు విద్యార్థుల పట్ల సరైన పద్ధతి కాదని తక్షణమే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు)జిల్లా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ భారత విద్యర్ది ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ మధు ప్రగతిశీల యువజన సంఘం (పి ఫై ఎల్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొర్రెపాటి రమేష్, కోలా లక్ష్మీనారాయణ బీఎస్పీ జిల్లా ఇన్చార్జి కర్రే కృష్ణ చెరుకుపల్లి నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల నాగరాజు జిల్లా కార్యదర్శి బుర్ర ఉపేందర్ అసెంబ్లీ ఇన్చార్జి జిల్లా కార్యదర్శి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎం.ఎస్.ఎఫ్) రాష్ట్ర నాయకులు హరీష్ మాదిగ పాడిమల్ల కిషోర్ (ఎంఎస్ఎఫ్) జిల్లా అధికార ప్రతినిధి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) జిల్లా నాయకులు ఎస్.కె శుభాన్ జిల్లా కోశాధికారి పేరాల శ్రీకాంత్ జిల్లా ఉపాధ్యక్షులు పాముల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు
.