డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న "లగ్గం" !!!

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం.ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు.

 Seventy Percent Shooting Of laggam Has Been Completed , Bonthala Nageswara Reddy-TeluguStop.com

తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు.ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం.

కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు.కామారెడ్డి, జనగామ, బీబీపేట ఇస్సానగర్ ప్రాంతాల్లో.

పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వేసిన సెట్స్ మధ్య 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల మూడు సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఏప్రిల్ 11 నుండి నూతన షెడ్యూల్ ప్రారంభం కానుంది.

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది.సీనియర్ ఆర్టిస్టులు రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ తెలుపుతుంది.ఈ చిత్రానికి కథ – మాటలు స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల .

సంగీతం:

చరణ్ అర్జున్.ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి.కెమెరామెన్: బాల్ రెడ్డి.ఆర్ట్:కృష్ణ సాహిత్యం: కాసర్ల శ్యామ్.సంజయ్ మహేశ్ వర్మ కొరియోగ్రఫీ.అజయ్ శివశంకర్.

నటీనటులు:

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి.సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి.కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్తన్న తదితరులు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube