స్నేహితుడికే షాక్ ఇస్తున్న కేసీఆర్

రాజకీయాల్లో ప్రాణ స్నేహితులు కూడా విడిపోయి శత్రువులుగా మారిపోతారు.రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం ఎవ్వరి వల్లా కాదు సరిగా ఇలాంటి పరిస్థితినే తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి పేస్ చేస్తున్నారు.

 Serious Action By Kcr On Best Friend-TeluguStop.com

సీఎం కెసిఆర్ కి ఎంతో ఆత్మీయ మిత్రుడు ఆయన.వరంగ‌ల్ జిల్లా భూపాల ప‌ల్లి నుంచి గెలిచిన ఆయ‌న‌కు సీఎం కేసీఆర్ మంచి ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారు కూడా.ఆయన సభలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు సింగరేణి ఎన్నికలు మధుసూధనా చారి రాజకీయ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చుపనున్నాయి అని తెలుస్తోంది

అసలు ఏమి జరిగింది.

ఇద్దరి స్నేహితుల మధ్య ఏమి అవుతోంది అనే విష‌యంలోకి వెళ్తే

సింగరేణి ఎన్నికలు భూపాల పల్లి పరిధిలో జరిగాయి.ఈ ఎన్నికలు కార్మికులకి సంభందిచినవి అయితే ఈ ఎన్నికలో విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి.

కేసీఆర్ ఏకంగా త‌న కుమార్తెను రంగంలోకి దింపి ఇక్క‌డ విజ‌యం సాధించారు.ఇదిలా ఉంటే గణపురం మత్స్యసొసైటీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది.అదేవిధంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భూపాల‌ప‌ల్లి డివిజ‌న్‌లో ఓడిపోయింది.ఈ రెండు కూడా స్పీకర్ నియోజకవర్గం పరిధిలో ఉండటం తో పార్టీలో ఓటమికి సంభందించి అనేక ఆరోపణలు కేసీఆర్ దృష్టికి టీఆరెస్ నేతలు తీసుకు వచ్చారు

ఓటమికి కారణాలు అన్వేషించిన కేసీఆర్ మధుసూదనాచారి కుమారులు చేస్తే దందాలే ఓటమికి అసలు కారణం గా గుర్తించారు.

ఇక ఆయన్ని స్పీకర్ పదవి నుంచీ తప్పించడానికి కూడా రంగం సిద్దం చేశారు అని తెలుస్తోంది.అయితే మధుసూధనాచారికి ఈ సారి సీటు ఇచ్చేలా లేకపోవడంతో ఎవరికీ వారు సీటు మాకు కావాలంటే మాకు కావాలి అంటూ విశ్వ పయత్నాలు చేస్తున్నారట.

కొండా మురళి అయితే సీటు నాకు ఇవ్వండి లేకపోతె నా కూతురికి అయినా సరే ఇవ్వండి అని అడుగుతున్నరాని సమాచారం.ఏదేమైనా కేసీఆర్ బెస్ట్ ఫ్రెండ్‌గా గుర్తింపు సాధించిన మ‌ధుసూద‌నాచారికి కుమారుల వల్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని టాక్.

మరి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆశావాహులు వేచి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube