త్రిషకి ఇకపై అవకాశాలు రాకుండా అడ్డుకుంటామంటున్న నిర్మాతలు

ఈ సంవత్సరం త్రిషకి పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి.ఎలాగో స్టార్ హీరోలు ఎప్పుడో పక్కనపెట్టేసారు.

 Producers To Make Trisha Thrown Out Of The Industry?-TeluguStop.com

దాంతో, చిన్న చిన్న సినిమాలతోనే బండి లాక్కోస్తోంది ఈ డస్కీ బ్యూటి.అవి కూడా తుస్సుమంటుండటం గమనార్హం.

ఇక లేక లేక త్రిషకి ఓ పెద్ద సినిమా వచ్చింది.అదే సామి 2.విక్రమ్ కథానాయకుడు.అపుడెప్పుడో వచ్చిన సామికి ఇది సీక్వేల్.

అందులో హీరోకి త్రిషతో పెళ్ళవడంతో, ఈ కథ కొనసాగింపు కావడంతో త్రిషకి రోల్ ఇచ్చారు.అయితే హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నారు.

త్రిష ఏదో భార్య లాగా అక్కడక్కడ కనిపిస్తే, కీర్తి మేయిన్ హీరోయిన్ అన్నమాట.ఈ విషయం త్రిషకి నచ్చలేదు.

కాని తన పాత్ర ఆటలో అరటిపండు ని లేట్ గా అర్థం చేసుకుంది.అదికూడా నాలుగైదు రోజులు షూటింగ్ లో పాల్గొన్న తరువాత

ఇంకేం, చెప్పాపెట్టకుండా ప్రాజెక్టు లోంచి వాకవుట్ చేసింది.

నాలుగైదు రోజులు షూటింగ్ అంటే, ఎంత లేదన్నా 20-30 లక్షలు ఖర్చవుతాయి.మరి త్రిష ఇలా సడెన్ గా హ్యాండ్ ఇస్తే నిర్మాతలకి కష్టమే కదా‌.

పాత్ర నచ్చలేదు, పాత్ర నిడివి తక్కువ ఉంది, కీర్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఈ విషయాలన్ని సినిమా ఒప్పుకోకముందే మాట్లాడుకోవాలి.ఇక్కడే త్రిష తప్పుచేసింది

నిర్మాతలు త్రిషని వదిలే ప్రసక్తే లేదంటున్నారు.

కోర్టుకి ఈడుస్తాం, మమల్ని మోసం చేసినందుకు త్రిష ఇకపై ఏ సినిమాలో కూడా నటించకుండా తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేస్తాం అంటూ గొడవలు మొదలుపెట్టారు.గత నెల రోజులుగా ఈ తంతు నడుస్తున్నా, ఈ ఇండస్ట్రీ నుంచి తరిమేసే బెదిరింపులు ఈమధ్యే మొదలయ్యాయి.

మరి ఈ వివాదం ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube