బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శ్రీ వాణి( Actress Sreevani ) ఒకరు.ఈమె ఈటీవీలో అలాగే స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈమె యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి నెలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా 30 లక్షలకు పైగా ఆదాయం అందుకున్నాము అంటూ ఓ సందర్భంలో తెలియజేశారు.
ఇలా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నటువంటి శ్రీవాణి తాజాగా తన ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్( Bangkok ) వెళ్లారు.ఇలా బ్యాంకాక్ జూ పార్కులో ఈమె పులల తో( Tigers ) పెద్ద సహవాసమే చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఒక వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ జూ పార్కులో( Zoo Park ) ఏకంగా పులిని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని ఈమె పులికి పాలు పట్టారు.ఇక ఆ పులి కూడా ఏమాత్రం కదలకుండా ఎంచక్కా ఈమె పడుతున్నటువంటి పాలును తాగేస్తున్నారు.ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటిజెన్స్ ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో పై సోషల్ మీడియా వేదికగా నేటిజన్ లు స్పందిస్తూ పులులు కూడా పిల్లులుగా మారడం అంటే ఇదేనేమో కలికాలం అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం శ్రీవాణి గారు మీకు చాలా ధైర్యం ఉందండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే మరికొందరు జంతు ప్రేమికులు( Animal Lovers ) ఇలా మీ పాపులారిటీ కోసం జంతువులను ఇలా హింసించకండి.ఇలాంటి వాటిని దయచేసి ఎంకరేజ్ చేయకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇలా కొన్ని పులులకు సింహాలకు మత్తు ఇచ్చి సెలబ్రిటీలు వాటితో ఇలా ఫోటోలు దిగుతున్నారు.దీంతో మీ పాపులారిటీ కోసం జంతువులను ఇలా హింసించకండి.ఇలాంటి వాటిని దయచేసి ఎంకరేజ్ చేయకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇలా కొన్ని పులులకు సింహాలకు మత్తు ఇచ్చి అసలు సెలబ్రిటీలు వాటితో ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఇలా మన ఆనందం కోసం జంతువులను హింసించడం సరి కాదంటూ గతంలో ఎంతో మంది ఇలాంటి చర్యలపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే శ్రీవాణి వ్యవహార శైలిపై కూడా నేటిజన్ లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.