తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బుల్లితెర నటి శ్రీవాణి( Actress sreevani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది శ్రీవాణి.
సీరియల్స్ లో ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై పండుగ సమయాలలో వచ్చే స్పెషల్ ఈవెంట్ లో పాల్గొంటూ డాన్సులు తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది.
ఇటీవల కాలంలో ఆమెతోపాటు ఆమె భర్త ఆమె కూతుర్ని కూడా బుల్లితెరలు పరిచయం చేసింది శ్రీవాణి.

దీంతో భర్తతో పాటు ఇప్పటికే బుల్లితెరపై పలు షోలలో పాల్గొని రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ( YouTube channel )ని స్టార్ట్ చేసిన శ్రీవాణి తనకు తన భర్త కూతురికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రేక్షకులకు పంచుకుంటూ ఉంటుంది.సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తూనే ఉంటుంది.
ఇక ఆ వీడియోలో ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీవాణి తన యూట్యూబ్ ఖాతాలో ఒక వీడియోని విడుదల చేసింది.
ఆ వీడియో మరేదో కాదు హోమ్ టూర్.గత ఏడాది ఆమె తన సొంత ఇంటి కలను నిజం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవల అదే ఇంటికే ఇంటీరియర్ డిజైన్ చేయించి నూతన గృహంలా మార్చేసింది శ్రీవాణి.ఈ సందర్భంగా హోమ్‌టూర్ అంటూ యూట్యూబ్‌లో వీడియో రిలీజ్ చేసింది.ఈ వీడియోలో శ్రీవాణి, ఆమె భర్త విక్రమ్ మాట్లాడుతూ.పల్లెటూరు అంటే ఎంతో ఇష్టమని, ఒక నెల రోజులపాటు ఏదైనా పల్లెలో ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు.కనీసం ఒక నెలరోజుల పాటు పల్లెటూరి వాతావరణంలో గడుపుతూ చేయాలని భావిస్తున్నట్టు శ్రీవాణి దంపతులు తెలిపారు.అందుకే పల్లెటూరి వాతావరణం పై ఉన్న ఇష్టంతో ఇంటి గుమ్మం ముందు గుడిసె ఆకారం వచ్చే విధంగా అద్భుతంగా డిజైన్ చేశారు.
అంతేకాకుండా ఇంట్లో ఇంటి చుట్టూ పచ్చని చెట్లు పెంచి ఇల్లు మొత్తం పచ్చదనంతో నింపేశారు.ఇంకా ఇంటిని ప్రత్యేకంగా సోఫాలు, కుర్చీలు, ఫర్నిచర్ తో పాటుగా లైట్ సెట్టింగ్స్ తో అద్భుతంగా డిజైన్ చేశారు.
మరిముఖ్యంగా వీడియోలో లైట్ సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.లైట్ సెట్టింగ్ లను శ్రీవాణి భర్త ప్రత్యేకంగా ఏర్పాటు చేయించినట్టు వీడియోలో తెలిపారు.
అలాగే టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటూ రిమోట్తో ఆన్ చేసే ఫ్యాన్ అలాగే అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైట్స్ ని కూడా చూపించారు.మొత్తానికి అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.