కృష్ణంరాజు కుటుంబం లో ఉన్న ఈ ప్ర సెంటిమెంట్‌ గురించి మీకు తెలుసా ?

రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్ను మూసారు అనే వార్తతో ఈరోజు సినీ ప్రపంచమంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది.కృష్ణంరాజు అభిమానులైతే ఈ వార్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 Sentiments In Krishnam Raju Family ,krishnam Raju ,pra Sentiment , Prabahs , Pra-TeluguStop.com

కృష్ణంరాజు చనిపోవడానికి కొన్ని గంటల ముందే ఆసుపత్రికి చేరిన ప్రభాస్ ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు అనే వార్త ప్రస్తుతం బయట సంచలనం సృష్టిస్తుంది.తన కెరీర్ కు పునాది వేసిన కృష్ణంరాజు అంటే ఎల్లప్పుడూ గౌరవంగా ఉండే ప్రభాస్ తన పెదనాన్న చనిపోవడంతో కన్నీరు అవుతున్నారు.

కృష్ణంరాజు అన్న కుమారుడైన ప్రభాస్ అతడికి వారసుడుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక కృష్ణంరాజు కుటుంబంలో ఒక సెంటిమెంట్ ఉందనే విషయం మీకు తెలుసా అదేంటంటే ‘ ప్ర ‘ అనే పదం అసలు ఈ పదం సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నటుడిగా 200 కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణం రాజుకి కేవలం నటన మాత్రమే కాదు రాజకీయాల అన్నా కూడా మంచి ఆసక్తి ఉండేది.ఆయన ఎంపీగా కేంద్రం మంత్రిగా కూడా పనిచేశారు.

ఎంతో మంచి స్టార్ స్టేటస్ ఉన్న కృష్ణంరాజుకి ప్ర అనే పదం ఒక సెంటిమెంట్ అట.తనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా మరొక కుమార్తెను సైతం దత్తత చేసుకున్న క్రిష్టం రాజు ఈ నలుగురు కుమార్తెలకు కూడా ప్ర అనే అక్షరంతోనే పేర్లు పెట్టాడు.తొలిత ఒక అమ్మాయిని దత్తత తీసుకున్న కృష్ణంరాజు ఆమెకు ప్రశాంతి అని నామకరణం చేశాడు.తనకు పుట్టిన ముగ్గురి కూతుళ్ళకి కూడా అలాగే పేర్లు పెట్టాడు.పెద్ద కూతురు పేరు సాయి ప్రసీద, రెండవ కుమార్తె పేరు సాయి ప్రకీర్తి, మూడవ కుమార్తె పేరు సాయి ప్రదీప్తి.

Telugu Krishnam Raju, Pra, Prabahs, Pramod Raju, Prasedha, Prashanthi, Sai Prade

వీరికి మాత్రమే కాదు కృష్ణంరాజు అన్న కుమారులైన ఇద్దరికీ కూడా ఈ విధంగానే పేర్లు పెట్టారు మొదట అబ్బాయి పేరు ప్రమోద్ రాజు, రెండవ అబ్బాయి పేరు ప్రభాస్ రాజు.ఇక ప్రభాస్ హీరోగా ఫ్యాన్ ఇండియా స్టార్ గా తెలుగులో చక్రం తిప్పుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube