ఆ కారణం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ను టైగర్ అని పిలుస్తారా.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr NTR ) గురించి, తారక్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తారక్ తో సినిమాలు చేసిన దర్శకులు తారక్ తో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలో తారక్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్( Senthil Kumar ) ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఇంటర్వెల్ ఫైట్ సీన్ హైలెట్ అని జంతువులతో ఎన్టీఆర్ జంప్ చేసే సీన్ సినిమాలో బెస్ట్ సీన్ అని సెంథిల్ కుమార్ వెల్లడించారు.తారక్ ఇంట్రడక్షన్ సీన్ లో తారక్ వేగాన్ని అందుకోవడం మాకు ఎంతో కష్టమైందని ఆయన కామెంట్లు చేశారు.

అంత ఫాస్ట్ గా ఏ విధంగా పరుగెత్తావని తారక్ ను అడిగితే తాను నేషనల్ లెవెల్ అథ్లెట్ అని తారక్ చెప్పారని సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.

Senthil Kumar Comments About Junior Ntr Details, Ntr , Young Tiger Jr Ntr, Jr Nt
Advertisement
Senthil Kumar Comments About Junior Ntr Details, Ntr , Young Tiger Jr Ntr, Jr Nt

అందువల్లే తారక్ ను టైగర్( Tiger ) అని పిలుచుకుంటారేమో అని ఆయన వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి రాజమౌళి సైతం పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఅర్ దేవర సినిమాలో తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా.

Senthil Kumar Comments About Junior Ntr Details, Ntr , Young Tiger Jr Ntr, Jr Nt

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో( Devara Movie ) తను సక్సెస్ సాధించడంతో పాటు జాన్వీ కపూర్, కొరటాల శివలకు భారీ సక్సెస్ దక్కాల్సి ఉంది.దేవర సినిమా సక్సెస్ సాధించి జక్కన్న నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడంతో పాటు దసరాకు బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.తారక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు