ఏపీ లో సంచలనం గల్లంతయిన మినిస్టర్ ఓటు..!!

ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు కావడంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని శనివారం పేట 25వ డివిజన్ ఎంపీపీ స్కూల్ లో ఓటు వేయడానికి వచ్చిన మంత్రి ఆళ్ల నాని కి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.

ఓటర్ లిస్టు లో ఆళ్ల నాని పేరుకు బదులు మరో మహిళ పేరు ఉండటంతో ఓటు హక్కు వినియోగించకోకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు.వాస్తవానికి ఏలూరు ఓటర్ లిస్ట్ లో అనేక తప్పులు ఉన్నాయని ఇటీవల కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

ఈ క్రమంలో న్యాయస్థానం కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది.అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టులో సవాలు చేయడంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆఖరి క్షణం లో ఓటు వేయకుండా ఆపితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలపడంతో హైకోర్టు ఎన్నికలు సజావుగా జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

ఇలాంటి తరుణంలో ఏకంగా డిప్యూటీ సీఎం మంత్రి ఆళ్ల నాని సొంత నియోజకవర్గం ఏలూరులో ఓట్లు గల్లంతు కావడంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది.సొంత ఊరిలో తన ఓటు గల్లంతు కావడంతో చాలా అసహనంగా వెనుతిరిగారు మినిస్టర్ ఆళ్ల నాని.

Advertisement
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

తాజా వార్తలు