ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు( MP Raghuramakrishnaraju ) టికెట్ రాకపోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో నరసాపురం వైసీపీ ఎంపీగా గెలిచిన ఆయన కొన్నాళ్లకు…వైసీపీ పార్టీని విభేదించడం జరిగింది.అనంతరం ఢిల్లీలోనే ఉంటూ రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు.పరిస్థితి ఇలా ఉంటే 2024 ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది.
ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో( Tadepalligudem ) జండా సభ జరిగిన సమయంలో నరసాపురం కూటమి అభ్యర్థిగా… తానే పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు ప్రకటించుకున్నారు.
తీరా లిస్టు విడుదలైన తర్వాత నరసాపురం ఎంపీగా ( Narasapuram MP )బీజేపీ స్థానిక నేత శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించడం జరిగింది.ఈ పరిణామంతో టికెట్టు రాకపోవడంతో రఘురామ రాజు ఎంతో ఆవేదన చెందారు.పరిస్థితి ఇలా ఉంటే గురువారం రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూటమి తరపున నరసాపురం ఎంపీగా తానే పోటీ చేస్తానని, ఎలాగూ బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో అదే పార్టీ నుంచి అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.టికెట్ రాకుండా చేయడంలో జగన్ తాత్కాలికంగా విజయం సాధించారు.
అయితే నరసాపురం పార్లమెంట్ నుంచి కూటమి తనను బరిలో ఉంచుతుందని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.