ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వాడి వేడిగా జరుగుతున్నాయి.వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ నిన్న తెనాలిలో జరిగిన సభలో 175 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని.
ప్రతిపక్షాలపై తీవ్రస్వరంతో సవాలు విసిరారు.దీంతో ఎన్నికలకు ఏడాది ముందుగానే ఏపీలో పొలిటికల్ వాతావరణం నువ్వా నేనా అన్నట్టుగా మారింది.
ఈ క్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమా అధికార పార్టీ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.రాబోయే ఎన్నికలలో ప్రజలు వైసీపీకి గట్టిగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికలలో 151 సీట్లలో రెండు… ఒకట్లు తీసేస్తే మిగిలేది 5…అవే వైసీపీ గెలుచుకునే స్థానాలు అని జోష్యం చెప్పారు.ప్రధాని నొక్కిన బటన్ మరోసారి నువ్వు నొక్కడం ఏమిటి అని సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.లక్షల కోట్లు ఇస్తే రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అని నిలదీశారు.పులిచింతలకు, గుండ్లకమ్మకు గేట్లు పెట్టడం చేతకాదు.కానీ ఈ బిడ్డకు 175 సీట్లు కావాలంట అంటూ వ్యంగ్యంగా సీఎం జగన్ పై దేవినేని ఉమా కామెంట్లు చేశారు.







