పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పర్యటనలో సీఎం జగన్ పాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.దాదాపు ₹3,300 కోట్ల రూపాయల పనులకు సంబంధించి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గంలో ఒకేరోజు ఇన్ని వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు.నర్సాపురంలో ఆక్వా రంగానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఇప్పుడు ఆక్వా యూనివర్సిటీ శంకుస్థాపనతో.ఈ ప్రాంతంలో రూపురేఖలు మారిపోతాయి.దేశంలో తమిళనాడు, కేరళ తర్వాత ఏపీలో మూడో ఫిషరీస్ యూనివర్సిటీ వస్తోంది అని తెలియజేశారు.అలాగే ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపడం జరిగిందని.వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు.
నేడు అందుకే నరసాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు.కాపురం పర్యటనకు ముందు సోషల్ మీడియాలో సీఎం జగన్ తెలియజేయడం జరిగింది.
ఈ పర్యటనలో ఆక్యా యూనివర్సిటీతో పాటు బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఇదే సమయంలో నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సిఎం జగన్ ప్రారంబించారు.







