సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వాళ్ళ నటన తో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు కానీ వాళ్ళు స్టోరీ లో చేసిన కొన్ని తప్పుల వల్ల సరైన సక్సెస్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అవ్వాల్సి వస్తుంది.వాళ్ళు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన కూడా వాళ్ల మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది.అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అయిన చాలా మంది నటులు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తారు…ఇక ఇప్పుడు చాలా మంది సీనియర్ నటులు( Senior Actors ) రీ ఎంట్రీ ఇస్తున్నారు వాళ్లెవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

ఒకప్పుడు సిక్స్ టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి సినిమాల్లో హీరో గా నటించిన రోహిత్…( Hero Rohit ) అప్పట్లో కొద్దీ రోజుల పాటు హీరో గా కొనసాగిన విషయం మనకు తెలిసిందే.ఇక ఆ తరువాత హీరో గా అవకాశాలు తగ్గిపోవడం తో ఈయన ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చింది.అందుకే ఇక ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ దొరకడం తో ఆయన మళ్లీ సినిమాలోకి వస్తున్నట్టు గా తెలుస్తుంది…

ఇక ఈయనే కాకూండా ఇండస్ట్రీ లోకి ఇప్పటికే రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ వెనకడుగు వేసిన వడ్డే నవీన్( Vadde Naveen ) కూడా ప్రస్తుతం ఒక పెద్ద సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు గా తెలుస్తుంది.ఈయన ఒకప్పుడు మంచి హీరో గా చాలా సినిమాలో నటించాడు అయిన కూడా ఆయన కి పెద్దగా గుర్తింపు రాలేదు ఇక దానితో ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అయిపోయాడు ఇక మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్నాడు…ఈయన చేసిన కొన్ని సినిమాలు అప్పట్లో మంచి హిట్లు అందుకున్నాడు.ఇక ఫ్యామిలీ లేడీస్ లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉండేది అనే చెప్పాలి…








