రేవంత్ టార్గెట్ గా సరికొత్త రాజకీయం ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, ఆ పార్టీ లోని నాయకులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు గా ఉన్న ఈ పార్టీలో ఇప్పటికీ మార్పు అయితే కనిపించడం లేదు.

2014 ఎన్నికల దగ్గర నుంచి చూసుకుంటే, ప్రతి దశలోనూ ఓటమిని చవి చూస్తూ వస్తోంది .బలమైన నాయకులు చాలామంది టిఆర్ఎస్, బిజెపిల లో చేరి పోగా, అవకాశం లేనివారు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.ఎప్పటికైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.

కానీ పార్టీకి మేలు జరిగే అంశాలను విస్మరిస్తూ, సొంత పార్టీలోని నాయకులు ఎదుగుదలను అడ్డుకుంటూ, గ్రూపు రాజకీయాలకు ప్రోత్సాహం ఇస్తూ, పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు తెలంగాణలో బిజెపి బలపడడానికి కారణం కాంగ్రెస్ పార్టీలోని కుమ్ములాటలే కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే.

ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది.తెలంగాణ  కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ పార్టీలో నాయకుల అభిప్రాయ సేకరణ చేపట్టారు.

Advertisement

ఇదిలా ఉంటే పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఎక్కువగా రేవంత్ రెడ్డికి ఉంది అనే ప్రచారం గట్టిగా ఊపందుకుంది.ఆయన అయితే కాంగ్రెస్ ను ఒడ్డున పడేయగలరు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది.

ఇక అధిష్టానం కూడా రేవంత్ వైపు మొగ్గు చూపుతున్న క్రమంలో, పార్టీలోని సీనియర్ నాయకులు అంతా ఏకమై రేవంత్ కు ఆ పదవి రాకుండా తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఇప్పటికే పార్టీలోని నాయకుల అభిప్రాయాలను సేకరించి ఢిల్లీకి వెళ్లిన మాణిక్యం ఠాకూర్ అధిష్టానానికి ఏ నివేదిక ఇవ్వబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

ఎక్కువగా రేవంత్ పేరు వినిపిస్తుండటంతో, మిగతా సీనియర్ లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తూ, ఆయనకు ఆ పదవి దక్కకుండా చేసే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.ఈ మేరకు అధిష్టానం దగ్గర తమ పలుకుబడి మొత్తం ఉపయోగించి రేవంత్ కు కాకుండా, వేరే వారికి ఇచ్చినా ఫర్వాలేదు అన్నట్లుగా సంకేతాలు పంపిస్తున్నారు.

అసలు రేవంత్ కాంగ్రెస్ వాది కాదు అని, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారని , మొదటి నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్న వారికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొత్త మెలిక పెడుతున్నారు.రేవంత్ కాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇలా ఎవరికి ఇచ్చినా, తమకు అభ్యంతరం లేదు అని, రేవంత్ కు మాత్రం ఇవ్వొద్దంటూ ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లాభియింగ్ చేస్తుండడం తో అధిష్టానం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

మరో వారం రోజుల్లో కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపిక పూర్తికానున్న క్రమంలో, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

తాజా వార్తలు