నాకు శ్రీదేవి గురువు అంటూ చెప్పిన అన్నగారు ..ఎందుకో తెలుసా ?

సినిమా పరిశ్రమ అంటేనే ఎన్నో వింతలు, విశేషాల సమ్మేళనం అనే చెప్పాలి.కొన్నిసార్లు కథలు విశేషంగా ఉంటే మరికొన్నిసార్లు క్యాస్టింగ్ ఎంతో గొప్పగా ఉంటుంది.

 Ntr About Sridevi Dance Talent,ntr,senior Ntr,sridevi,vetagadu,vetagadu Movie,pa-TeluguStop.com

అలా ఇండస్ట్రీలో కొన్ని జంటలు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైనవిగా నిలిచిపోతా ఉంటాయి.ఒకసారి ఒక కాంబినేషన్ లో సినిమా వచ్చి హిట్ అయితే ఇక ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారు.

ఆ కాంబినేషన్ లో మళ్ళీ ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు థియేటర్లకు ఎగబడి మరీ వెళ్లి సినిమా చూస్తారు.అలా ఎంతో హిట్ అయినా కాంబినేషన్ లలో ఒకటి ఎన్టీఆర్, శ్రీదేవి జంట.
వాస్తవానికి ఎన్టీఆర్ కి మనవరాలుగా శ్రీదేవి బడి పంతులు నటించిన ఆ తర్వాత ఐదేళ్లకే కేవలం శ్రీదేవికి పదహారేళ్ల వయసు రాగానే శ్రీదేవిని వాళ్ళ అమ్మ హీరోయిన్ గా చేయడంతో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా మొదటి అవకాశం పొందింది.అలా అత్యంత చిన్న వయసులో ఎంతో ఏజ్ అయినా పెద్దాయన తో శ్రీదేవి నటించిన కూడా ఆ చిత్రం సూపర్ హిట్ కాంబో అని కూడా పేరు తెచ్చుకోవడం నిజంగా అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా వేటగాడు.ఈ సినిమా ఎంతో పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టు కావడంతో వీరి జంటకు సౌత్ ఇండియాలోనే మంచి పాపులర్ జంటగా పేరు వచ్చింది.

Telugu Senior Ntr, Sridevi, Vetagadu-Movie

ఇక వేటగాడు సినిమాలో పాటలు, డాన్సులు కూడా ఎంతో మంచి హిట్ కావడంతో ప్రతి పాటకు జనాలు స్టెప్పులు వేశారు.ఆకు చాటు పింద తడిసె అని ఎన్టీఆర్ అంటే జనాలు ఉర్రూతలు ఊగిపోయారు.వానలో తడిసి శ్రీదేవి పాట పాడితే ఆ మత్తులో ప్రేక్షకులు కూడా ఊగిపోయారు.ఇలా ఈ సినిమాలో పాటలతో పాటు డాన్సులు కూడా బాగా హీట్ అయ్యాయి.

దాంతో ఎన్టీఆర్ ఏకంగా శ్రీదేవిని నాకు డాన్సులు నేర్పుతావా? నాకు గురువుగా ఉంటావా అని అడిగారట ఎన్టీఆర్.అలా కొన్ని స్టెప్పులు శ్రీదేవి దగ్గరుండి మరి నేర్పించిందట.

శ్రీదేవికి నటన విషయంలో ఎన్నో సలహాలు ఇచ్చేవారట అన్నగారు.అలా శ్రీదేవి ఎన్టీఆర్ కి గురువు గా మారింది.

ఈ విషయం స్వయంగా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ లో తెలపడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube