కెనడాలో భారత హైకమీషనర్‌గా సంజయ్ కుమార్ వర్మ.. విదేశాంగ శాఖ ఆదేశాలు

కెనడాలో తదుపరి భారత హైకమీషనర్‌గా సీనియర్ దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది.అలాగే ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో వున్న భారత కాన్సులేట్ జనరల్ అమిత్ కుమార్‌ను రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు తదుపరి రాయబారిగా నియమించింది కేంద్రం.ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.1988 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్ వర్మ.ప్రస్తుతం జపాన్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు.57 ఏళ్ల వర్మ.ప్రస్తుతం కెనడాలో తాత్కాలిక భారత హైకమీషనర్‌గా వ్యవహరిస్తున్న అన్షుమాన్ గౌర్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

 Senior Diplomat Sanjay Kumar Verma Appointed As Indian High Commissioner In Cana-TeluguStop.com

హాంకాంగ్, చైనా, వియత్నాం, టర్కీలలో వున్న భారతీయ మిషన్‌లలో వర్మ పనిచేశారు.

ఇటలీలోని మిలన్‌లో భారత కాన్సుల్ జనరల్‌గానూ సంజయ్ విధులు నిర్వర్తించారు.బీహార్‌లోని పాట్నా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన ఆయన.ఐఐటీ ఢిల్లీ నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు.భారత్‌కు కెనడా ప్రస్తుతం అత్యంత సన్నిహితంగా మెలుగుతోన్న నేపథ్యంలో అనుభవజ్ఞుడైన సంజయ్ కుమార్ నియామకం ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

Telugu Amit Kumar, Canada, India, Sanjaykumar-Telugu NRI

ఇక .మరో దౌత్యవేత్త అమిత్ కుమార్ విషయానికి వస్తే ఆయన 1995 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి .గతంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా విధులు నిర్వర్తించారు.అలాగే ఇటీవల డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ సెక్రటరీగా, న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మానవ వనరుల వ్యవహారాల జాయింట్ సెక్రటరీగానూ అమిత్ పనిచేశారు.

ఐఐటీ కాన్పూర్ నుంచి అమిత్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube