సీనియర్ నటి ఆమని ( Aamani ) బిగ్ బాస్ 5 విన్నర్ V.J.సన్నీ హీరోగా చేస్తున్న సౌండ్ పార్టీ సినిమాలోని హీరోయిన్ హృతికకి మధ్య ఉన్న సంబంధం ఏంటి.వీరిద్దరి మధ్య ఎంత దగ్గరి సంబంధం ఉందో అనే విషయం తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ విషయాన్ని స్వయంగా సౌండ్ పార్టీ ( Sound Party ) హీరోయిన్ హృతికనే బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.మరి ఇంతకీ ఆమని కి ఆ హీరోయిన్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి.
వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ 5 విన్నర్ వీ.
జే.సన్నీ ( V.J.Sunny ) హీరోగా వస్తున్న సౌండ్ పార్టీ సినిమాలో హృతిక శ్రీనివాస్ హీరోయిన్ గా చేస్తుంది.అయితే ఈ సినిమా నవంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ పాల్గొంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతున్నారు.ఈ నేపథ్యంలోనే హీరోయిన్ హృతిక( Heroine Hrithika ) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సీనియర్ నటి ఆమని మా అత్తనే ఇక చిన్నప్పటినుండి మా అత్త ఆమని ని చూసుకుంటూ సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది.

అందుకే సినిమాల్లో హీరోయిన్గ గా చేస్తున్నాను.ఇక నేను మొదట అల్లంత దూరాన ( Allantha doorana ) అనే సినిమాలో హీరోయిన్ గా చేశాను.ఇది నా రెండో సినిమా.ఇక ఈ సినిమా కథ చెప్పగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది.అందుకే ఈ సినిమాకి ఒప్పుకున్నాను.అలాగే ఈ సినిమాలో నా పాత్ర క్రికెట్ టీం లో ధోనిలా ఉంటుంది అని డైరెక్టర్ ప్రతిసారి అనేవారు.
అందుకు తగ్గట్టే నా పాత్ర ఉంటుంది.ఇందులో చివరిలో నా పాత్ర బిగ్ షాక్ ఇస్తుంది.

అమాయకులైన తండ్రి కొడుకులు ఇద్దరు డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి పనులు చేస్తారు అనే దాని మీదే ఈ సినిమా తెరకెక్కింది.అంటూ హృతిక చెప్పకొచ్చింది.ఇక ఆమని తనకి అత్త అవుతుంది అని హృతిక చెప్పడంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.