ఈ మధ్య వరుసగా విషాద వార్తలు అన్ని ఇండస్ట్రీలను కుదిపేస్తున్నాయి.సీనియర్ స్టార్స్ అంత ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడం సినీ ఇండస్ట్రీలకు తీరని లోటుగా మిగులుతుంది.
మరి ఈ రోజు ఉదయాన్నే టాలీవుడ్( Tollywood ) లో మరో విషాదకరమైన వార్త అందింది.
ఈ వార్తతో మరోసారి టాలీవుడ్ లో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి.సీనియర్ నటులు, కథానాయకుడు చంద్రమోహన్( Chandra Mohan ) మృతి చెందారు.ఈయనకు ప్రస్తుతం 82 ఏళ్ళు.
దీంతో ఈయన హృద్రోగంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది.
హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి(Apollo Hospitals )లో ఈయన మరణించినట్టు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అనారోగ్య కారణంగా ఈయన ఆసుపత్రిలో వైద్యం అందుకుంటూ ఈ రోజు ఉదయం 9.45 నిముషాలకు మరణించినట్టు తెలుస్తుంది.ఇక చంద్రమోహన్ అంత్యక్రియలు హైదరాబాద్ లో జరగనున్నాయి.
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని వందల సినిమాల్లో నటించారు చంద్రమోహన్.మరి అలాంటి నటుడు ఒక లేరు అనే వార్త టాలీవుడ్ లో విషాదానికి గురి చేస్తుంది.