కొత్త కన్ఫ్యూజన్ లో సేనాని..?

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో యాక్టిివ్ అవుతున్నారు.

 Senani In The New Confusion ,pavan Kalyan, Janasena, Chandrababu Ycp, Kapu, Ts B-TeluguStop.com

అడపాదడపా విమర్శలు చేస్తూ కుర్రకారును తన దారిలోకి తెచ్చుకుంటూ ఉన్నారు.ఏపీ లో రెండు గోదారి జిల్లాల్లోని తన సామాజిక వర్గం తో పాటు.

ఉత్తరాంధ్ర లోని తూర్పు కాపు ఓట్ల పై ఫోకస్ పెట్టారు. ఏపీలో కుల రాజకీయాలతో ఎంతో కొంత ప్రభావం చూపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు.

అంతేకాకుండా కుల సమీకరణా లతో పవన్ ఒక 5 నుంచి 10 సీట్లు గెలవాలని గట్టిగా కూర్చున్నారు.

Telugu Chandrababu Ycp, Janasena, Kapu, Kondagattu, Pavan Kalyan, Pavan, Ts Bjp,

ఏపీలో ఎలాగో టీడీపీ తో దాదాపు పొత్తు ఫైనల్ కావడం తో ఇప్పుడు ఆయన దృష్టి తెలంగాణ పైన పడింది.ఇక్కడ 7 నుంచి 14 లోక్ సభ స్థానాలకు పోటి చేస్తాను అని ప్రకటించారు.అంతే కాకుండా ఒక పరిమిత సంఖ్యలో అసెంబ్లీ కి కూడా అభ్యర్థిని నిలబెడతా అని ప్రకటించారు.

ఇలాటి టైమ్ లో తెలంగాణ లో మళ్లీ యక్టివ్ కావడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది.కేంద్రంలో బీజేపీ తో పొత్తు లో ఉన్న పవన్ ఇప్పుడు ఇక్కడ బీజేపీ తో కలిసి రాజకీయం చేయాలా.? లేక టీడీపీ తోనే ఎన్నికల్లో వెళ్లాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

Telugu Chandrababu Ycp, Janasena, Kapu, Kondagattu, Pavan Kalyan, Pavan, Ts Bjp,

అధిష్టానం మాట కాదనలేక బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ వైసీపీ కి అది ఆయుధం గా మారుతుంది.అలాగే తెలంగాణలో ప్రత్యర్థులు ఇక్కడ మిత్రులు అనే నినాదం రాజకీయంగా వైసీపీ కి కలసి వస్తుంది.ఇక తెలంగాణ లోనూ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రోళ్లు మళ్లీ వచ్చారు అనే నినాదం బీ అర్ ఎస్ పార్టీకి కలసి వస్తుంది.

ఒకవేల బీజేపీ తో పొత్తు పెట్టుకున్నా.అది బీజేపీ కే మైనస్ అవుతుంది.ఒకవేల ఒంటరిగా పోటీ చేద్దాం అనుకుంటే ఇక్కడ అయన సామాజిక వర్గం ఓట్లు పెద్దగా లేకపోవడం తో పాటు.తెలంగాణ జన సేన లో చెప్పుకో దగ్గ స్థాయి నేతలు లేరు.

అందుకే అటు ఏపీ రాజకీయాలు.ఇటు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయాలి అంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.చూడాలి ఎన్నికల నాటికి ఏ సమీకరణాలు ఎలా మారుతాయో.

Telugu Chandrababu Ycp, Janasena, Kapu, Kondagattu, Pavan Kalyan, Pavan, Ts Bjp, .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube