స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్.. తండ్రి ఉన్నప్పుడే బాగా చూసుకోవాలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎదగడం సులువు కాదు.శేఖర్ మాస్టర్ ఎంతో కష్టపడి ప్రస్తుతం నంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ గా ఉన్నారు.శేఖర్ మాస్టర్( Sekhar master ) కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.ఢీ15 ప్రోమో( Dhee 15 _ తాజాగా రిలీజ్ కాగా ప్రోమోలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.“తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది” అని చెబుతూ కంటెస్టెంట్లు మన్నించయ్యా తప్పు మన్నించయ్యా సాంగ్ కు డ్యాన్స్ చేశారు.

 Sekhar Master Comments About His Father In Dhee Show Details Here Goes Viral ,-TeluguStop.com

ఆ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసిన శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ “అందరు కొడుకులకు చెబుతున్నా తండ్రి ఉన్నప్పుడే చాలా బాగా జాగ్రత్తగా చూసుకోండి మిస్ యూ నాన్నా” అంటూ కామెంట్ చేశారు.ఈ ప్రోమోకు 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ నెల 19వ తేదీన ఈ ఎపిసోడ్ బుల్లితెరపై ప్రసారం కానుందనే సంగతి తెలిసిందే.ఈ ప్రోమో గుండెను కదిలించిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

శేఖర్ మాస్టర్ గతంలో కూడా పలు సందర్భాల్లో తన తండ్రిని తలచుకోవడంతో పాటు తండ్రి గొప్పదనం గురించి కామెంట్లు చేశారు.శేఖర్ మాస్టర్ పారితోషికం ( Remuneration )ప్రస్తుతం సాంగ్ కు 5 లక్షల రూపాయల రేంజ్ లో ఉంది.శేఖర్ మాస్టర్ కు హీరోల్లో క్రేజ్ పెరుగుతోంది.సీనియర్ హీరోలు సైతం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి ఫిదా అవుతున్నారు.కొంతమంది హీరోలు తమ ప్రతి సినిమాలో శేఖర్ మాస్టర్ కు ఛాన్స్ ఇస్తున్నారు.

శేఖర్ మాస్టర్ కు ఇతర భాషల నుంచి సైతం మంచి ఆఫర్లు వస్తుండటం గమనార్హం.శేఖర్ మాస్టర్ రేంజ్ మరింత పెరగాలని ఆయన కెరీర్ పరంగా మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా శేఖర్ మాస్టర్ ఈ స్థాయికి చేరుకున్నారు.

శేఖర్ మాస్టర్ వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube