మనం జీవ ఆయుధాల గురించి ఎన్నో సంవత్సరాలనుండి ఎన్నో రకాలుగా వుంటూ వస్తున్నాం.అయితే దీనిపై మరలా ప్రస్తావన వచ్చింది మాత్రం ప్రపంచ మహమ్మారి కరోనా సమయంలోనే.
చైనా ల్యాబ్‌లో తయారు చేసిన కరోనా కూడా బయోలాజికల్ వెపన్ అని చాలా మంది అప్పట్లో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే సృష్టించాయి.అయితే చాలా నష్టపోయిన తరువాత ప్రపంచం కరోనాపై విజయం సాధించింది.
కానీ ఇప్పుడు కనిపిస్తున్న ముప్పును ఎదుర్కోవటానికి మార్గం లేదు అని అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే, మానవ జీవితాన్ని నాశనం చేసే ఇటువంటి జీవ ఆయుధాలను ఉగ్రవాద గ్రూపులు తయారు చేసే అవకాశం ఉందని, బహుశా ఈపాటికే ఓ ప్లాన్ వేసి ఉంటారని కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచమంతటా పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి.వాటిని క్రిమి డ్రోన్ల (ఫ్లై లాంటి డ్రోన్స్) ద్వారా ప్రజలకు హానికరం చేయవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రమాదం ఏ ఒక్క దేశానికో కాకుండా యావత్ ప్రపంచంపైనే ఉందనే వాదన కూడా బలంగా ఇపుడు వినిపిస్తోంది.

అయితే ఈ వ్యాఖ్యలు చేసి మరెవరో కాదు, యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో గ్లోబల్ బయో సెక్యూరిటీ బోధిస్తున్న ప్రొఫెసర్ రైనా మెక్‌ఇంటైర్, ఉగ్రవాదులు జీవ ఆయుధాలను తయారు చేసే అవకాశం ఉందని తాజాగా అనుమానం వ్యక్తం చేశారు.ఉగ్రవాదులు తమ సొంత ల్యాబ్‌లో అలాంటి ఆయుధాలను లేదా వైరస్‌లను తయారు చేసే పనిని చాలా తేలికగా చేయగలరు అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ప్రొఫెసర్ రైనా మెక్‌ఇంటైర్ ప్రకారం, మనం ఆన్‌లైన్‌లో ‘ల్యాబ్ ఇన్ బాక్స్’ కిట్‌లను కొనుగోలు చేయవచ్చు, 3డి ప్రింటింగ్‌తో పాటు, బయోలాజికల్ మెటీరియల్‌ని కూడా ఆర్డర్ చేయవచ్చు.రానున్న కాలంలో ఈ సాంకేతికత మానవ మనుగడకే ముప్పుగా పరిమమించొచ్చని అతను అభిప్రాయపడ్డారు.







