శ్రీశైలం: శ్రీశైలంలోని దర్శనం క్యూలైన్లలో సెక్యూరిటీపై పిడిగుద్దులు స్దానికుడి హల్ చల్.భయాందోళనకు గురైన భక్తులు.
శ్రీశైలంలోని ఆర్జిత సేవ క్యూలైన్లలో భారీ గొడవ.సెక్యూరిటీగార్డు స్దానిక యువకుడు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగిన యువకులు.
భక్తులు దర్శనానికి వెలుతున్న సమయంలో ఇరువురు గొడవకు దిగారు.ఒకరిపై ఒకరు బహిరంగంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు.
గోడవను చూసిన భక్తులు క్యూలైన్లలో భయాందోళనలకు గురయ్యారు.
ఆధ్యాత్మిక భావనతో భక్తి శ్రద్ధలతో కార్తీకమాసం సోమవారం నాడు స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకునేందుకు భక్తులు శ్రీశైలం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటే క్యూలైన్లలో సెక్యూరిటీ గార్డు స్దానిక యువకుడు బాహాబాహికి దిగటంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.
నవీన్ అనే యువకుడు 5 వందల దర్శనం టికెట్లు 20 మందికి డైరెక్టుగా గుడిలోకి వెళ్లాలని క్యూలైన్లలో వెల్లకుండా సెక్యూరిటీ గార్డుతో వాగ్వివాదానికి దిగాడని.సెక్యూరిటీ అనుమతించకపోవడంతో ఇరువురు బాహాబాహికి దిగి క్యూలైన్లలో పిడిగుద్దులు గుద్దుకుంటూ భారి గొడవకు దారితీశారు.
దీనితో క్యూలైన్లలో ఉన్న భక్తులు దేవాలయం పరిదిలో ఇలాంటి గొడవలు ఏంటని పెదవి విరుస్తున్నారు.