కెనడాలో ఖలిస్తాన్ ( Khalistan in Canada )మద్ధతుదారుల ఆగడాలు నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలు, విగ్రహాలు, మహాత్మా గాంధీ విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి.
అంతేకాదు.భారతీయ దౌత్య కార్యాలయాలపైనా దాడులు చేస్తూ, దౌత్య సిబ్బందిని బెదిరిస్తున్నారు.
ఖలిస్తాన్ వేర్పాటువాదులను నియంత్రించాలని భారత ప్రభుత్వం( Government of India ) ఎన్నిసార్లు హెచ్చరించినా కెనడా పట్టించుకున్న దాఖలాలు లేవు.ఇవి అంతిమంగా ఇరుదేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కెనడాలోని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ అప్రమత్తమైంది.ఖలిస్తాన్ వేర్పాటువాదుల హెచ్చరికల నేపథ్యంలో ఒట్టావాలోని భారత హైకమీషనర్ నివాసం వద్ద భద్రతను పెంచింది.
ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లలోని( Ottawa, Toronto, Vancouver ) భారతీయ మిషన్‌ల వద్ద జూలై 8న జరిగిన ర్యాలీలను మించి ఆగస్ట్ 15న ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఆన్‌లైన్ పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శనల తీవ్రత మరింత ఎక్కువగా వుంటుందని ఓ సీనియర్ భారతీయ అధికారి అభివర్ణించారు.ఆ పరిణామాలు హద్దు దాటినట్లుగా కనిపిస్తున్నాయి.
సిక్కు వేర్పాటువాద గ్రూపు ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’( Six for Justice ) (ఎస్ఎఫ్‌జే) .సీజ్ ఇండియన్ మిషన్స్ అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో కెనడా అధికారులు , గ్లోబల్ అఫైర్స్ కెనడా , రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు భద్రతను పెంచుతున్నట్లుగా ఒక అధికారి తెలిపారు.
జూలై 14న జకార్తాలోని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మినిస్టీరియల్ మార్జిన్‌లో సమావేశమైనప్పుడు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీని ( Melanie Jolie )కలిసిన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఖలిస్తాన్ వేర్పాటువాదుల ముప్పును లేవనెత్తారు.దీనిపై స్పందించిన జోలి.వియన్నా కన్వెన్షన్ ప్రకారం దౌత్యవేత్తల భద్రతను కెనడా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
కాగా.జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )దారుణహత్యకు గురయ్యాడు.గురునానక్ సింగ్ గురుద్వారా సాహిబ్ పార్కింగ్ ప్లేస్‌లో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
దీని వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందని ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు.ఆ తర్వాతి నుంచే ఎస్ఎఫ్‌జే బెదిరింపులు పెరిగాయి.భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ, టొరంటో, వాంకోవర్‌లలోని భారత కాన్సుల్ జనరల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ‘‘కిల్ ఇండియా’’ పోస్టర్లు వెలిశాయి.