ఫలితాల్లో దూకుడు: సీక్రెట్ సర్వీస్ పహారాలోకి జో బిడెన్‌‌

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందోనన్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.ఎన్నికలు జరిగి రెండు రోజులు గడిచినప్పటికీ.

విజేత ఎవరన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో ముందంజలో ఉన్నప్పటికీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే మరో ఆరు ఓట్లు కావాల్సి ఉంది.

డెమొక్రాటిక్ పార్టీకి కంచుకోటగా పిలిచే నెవాడా రాష్ట్రంలో ఉన్న ఆరు ఎలక్టోరల్‌ ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు బిడెన్‌కు మెండుగా ఉన్నాయి.విజయానికి అత్యంత చేరువలో ఉన్న ఆయనకు భద్రతను పెంచనున్నారు.

అమెరికా అధ్యక్షుడి భద్రతను పర్యవేక్షించే సీక్రెట్ సర్వీస్ విభాగం బిడెన్ వద్దకు ప్రత్యేక అధికారులను పంపించనుంది.ఇందుకు సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.

Advertisement
Secret Service Plans To Ramp Up Protection Of Joe Biden America, Joe Biden, Tru

ప్రస్తుతం డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో బిడెన్ ఉన్నారు.అమెరికా నూతన అధ్యక్షుడిగా ఆయన గెలిస్తే .విల్మింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి ప్రసంగించే అవకాశాలున్నాయి.ఈ క్రమంలో ఆ ప్రాంతం మొత్తం సీక్రెట్ సర్వీస్ ఆధీనంలోకి వెళ్లిపోయింది.

మ‌రోవైపు కౌంటింగ్‌ను ఆపివేయాలంటూ జార్జియా, మిచిగ‌న్‌లో కేసులు వేసిన ట్రంప్ మద్ధతుదారులకు ఎదురుదెబ్బ త‌గిలింది.ఆ కేసుల‌ను కోర్టులు కొట్టివేశాయి.అయినప్పటికీ కౌంటింగ్‌ను ఆపాల‌ని ట్రంప్ మ‌ద్ద‌తుదారులు, మెయిల్ ఇన్ ఓట్లు అన్నీ లెక్కింపు చేయాల‌ని బిడెన్ మ‌ద్ద‌తుదారులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతున్నారు.

దేశంలోని అనేక న‌గ‌రాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు జరుగుతున్నాయి.కొన్ని చోట్ల కౌంటింగ్ సెంట‌ర్ల వ‌ద్ద కూడా ధ‌ర్నా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతున్నారు.

ఫిలిడెల్ఫియాలోని ఓట్ కౌంటింగ్ సెంట‌ర్‌పై దాడికి ప్ర‌య‌త్నించిన ఓ కుట్ర‌ను పోలీసులు చేధించారు.జార్జియాలో పోరు హోరాహోరీగా మార‌డంతో.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!

అబ్సెంటీ ఓట‌ర్లు త‌మ ఓట్ల‌ను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాల‌ని డెమొక్రాటిక్ పార్టీ పిలుపునిచ్చింది.ఎలక్టోరల్‌ ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు బిడెన్‌కు మెండుగా ఉన్నాయి.

Secret Service Plans To Ramp Up Protection Of Joe Biden America, Joe Biden, Tru
Advertisement

మరోవైపు, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు 214 ఎలక్టోరల్‌ ఓట్లు లభించాయి.ఓట్ల సాధనలో వెనుకబడినప్పటికీ ఆయనకు కూడా విజయావకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.అయితే మళ్లీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలంటే కీలక రాష్ట్రాలైన జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, అలస్కాలోని అన్ని ఎలక్టోరల్‌ ఓట్లతో పాటు నెవాడాలోని ఓట్లను ట్రంప్‌ గెలువాల్సి ఉంటుంది.

నెవాడా మినహా మిగతా రాష్ట్రాల్లోని అన్ని ఓట్లను గెలిచినప్పటికీ, ట్రంప్‌ 268 ఎలక్టోరల్‌ ఓట్లను మాత్రమే సాధించగలరు.దీంతో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉండదు.ప్రస్తుతం జార్జియాలో ట్రంప్- బిడెన్ కంటే కేవలం 665 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.

ఇక్కడ ట్రంప్ గెలిస్తే 16 ఎలక్టోరల్ ఓట్లు ఆయనకే పడతాయి.అప్పుడు ఫలితం మరింత ఉత్కంఠగా మారతుంది.

ఒకవేళ బిడెన్ గెలిస్తే మాత్రం ట్రంప్ ఆశలు వదులుకోవాల్సిందే.

తాజా వార్తలు