అక్టోబర్ 15 నుంచే ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర?

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం తెలంగాణ బీజేపీ మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన 14 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభ్యర్థి కోమటిరెడ్డి రాజగగోపాల్ రెడ్డిని గెలిపించాలని పార్టీ అధిష్టానం మెజారిటీ సీనియర్ నేతలను కోరింది.

 Second Instalment Of Bjp Praja Sangrama Yatra From October 15 Details, Bjp, Pra-TeluguStop.com

మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు.కేసీఆర్ ఖేల్ కాబోతోందని…ఆయన దుకాణం బంద్ ఖాయమన్నారుల.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎతో కలిసి వచ్చినా బల ప్రదర్శనకు సిద్ధమని బీజేపీ నేతలు సవాల్ విసిరారు.రాష్ట్రంలో గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీగా మారిందని కమలం నాయకులు చెబుతున్నారు.

ప్రజా సంగ్రమ పాదయాత్రలో ప్రజల కష్టాలు నేతలను తీవ్రంగా కదలించాయని, అయితే అక్టోబర్ 15 నుండి 5 విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నట్లు ప్రకటించారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభకు అశేష జన వాహని తరలి వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Telugu Bandi Sanjay, Cm Kcr, Komatireddy, Mpvivek, Munugode, October, Prajasangr

బీజేపీ పోరాటంతోనే టీఆర్ఎస్ పార్టీ చరిత్రను వక్రీకరించే విధంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవానికి’ బదులు, ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ గా జరిపిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.పాతబస్తీలో జాతీయ జెండాను పట్టుకుని తిరిగేలా చేసిన ఘనత బీజేపీ దే అని అంటున్నారు.మునుగోడు ఉప ఎన్నికలో పక్కా గెలుస్తాం అని స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని కమలం నాయకులు చెబుతున్నారు.మునుగోడు లో రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తామని చెబుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు తెలుసని… అందుకే ఎస్సీ, ఎస్టీలను మరోసారి మోసం చేసేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నాడు అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube