తెలుగులో ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతున్నాయి.అయితే ఈ సినిమాలలో కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉండి సెకండాఫ్ చెత్తగా ఉండటం వల్ల ఫ్లాప్ అయ్యాయి.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా సెకండాఫ్ లో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసి ఉంటే ఈ సినిమాల ఫలితాలే మారేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తారక్ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఊసరవెల్లి( Usaravelli movie ) ఒకటి.కథ, కథనం బాగానే ఉన్నా చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఈ సినిమా ఫెయిలైంది.ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే ఈ సినిమా రేంజ్ మారిపోయేదని చాలామంది భావిస్తారు.
శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా సినిమా( Ramaiya Vastavaiya movie ) సెకండాఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.సెకండాఫ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.విజయ్ నటించిన లియో( Leo ) సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదు.
మహేష్ బాబు ఆగడు మూవీ( Agadu movie ) కూడా ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ మాత్రం సినిమా ఫ్లాప్ కావడానికి కారణమైంది.ఈ సినిమా కలెక్షన్ల పరంగా హిట్టైనా చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు.

రామ్ చరణ్ బ్రూస్ లీ( Bruce Lee ), పవన్ కళ్యాణ్ పంజా( Panja ) కూడా సెకండాఫ్ విషయంలో ప్రేక్షకులను నిరాశపరిచాయి.రవితేజ కిక్2 మూవీ( Kick 2 movie ) కూడా సెకండాఫ్ విషయంలో జరిగిన తప్పుల వల్ల నిరాశకు గురి చేసింది.మాస్ మహారాజ్ ఖిలాడీ సినిమా కూడా సెకండాఫ్ ఆకట్టుకునేలా లేకపోవడం వల్ల ఫ్లాప్ గా నిలిచింది.క్లైమాక్స్ ఆశించిన విధంగా లేకపోవడం వల్ల ఎన్టీఆర్ దమ్ము ఫ్లాప్ అయిందని ఫ్యాన్స్ భావిస్తారు.