Muzaffarpur, Bihar : పెళ్లికొడుకు చెల్లిని లైన్‌లో పెట్టిన వీడియోగ్రాఫర్.. పెళ్లయ్యాక ఇద్దరూ పరార్

ఎవరైనా పెళ్లి వేడుకలకు వెళ్తే అక్కడ ఫుడ్ ఎలా ఉందో ఆస్వాదిస్తారు.వచ్చిన బంధువులు, స్నేహితులతో చక్కగా మాట్లాడి వస్తారు.

 When The Videographer Who Put The Bridegrooms Sister On The Line Got Married Bo-TeluguStop.com

అదే పెళ్లికి వచ్చిన ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ వంటి వాళ్లకు చాలా గౌరవం లభిస్తుంది.తమ జీవితంలో మధుర క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో తీస్తారని అతిథుల తరహాలోనే వారిని బాగా చూసుకుంటారు.

అయితే ఓ పెళ్లికి వీడియోగ్రాఫర్‌గా వచ్చిన ఓ ప్రబుద్ధుడు చేసిన పని పెళ్లి ఇంటి వారికి పీడకలగా మారింది.బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో( Muzaffarpur in Bihar ) పెళ్లికి వచ్చిన వీడియోగ్రాఫర్ వరుడి సోదరితో కలిసి పరారీలో ఉన్నాడు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాలిక తండ్రి అహియాపూర్ పోలీస్ స్టేషన్‌లో( Ahiyapur Police Station ) ఫిర్యాదు చేశారు.మార్చి 4న తన కూతురు ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లిందని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు.

అప్పటి నుంచి ఆమె ఇంటికి తిరిగి రాలేదు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Telugu Ran, Love, Grapher, Latest, Grapherput-Latest News - Telugu

చందవారా ఘాట్‌లోని దామోదర్‌పూర్ ప్రాంతంలో మార్చి 4న గ్రామంలో ఓ యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు.పెళ్లి ఊరేగింపు మరో ఊరికి వెళ్లనుంది.పెళ్లి వేడుకను కవర్ చేయడానికి వరుడి బావ ఆ గ్రామంలోని వీడియోగ్రాఫర్‌ని ( Videographer )పిలిచాడు.అక్కడి వరకు అంతా బాగానే జరిగింది.ఎవరికీ తెలియకుండా పెళ్లి కొడుకు చెల్లిని ఆ వీడియోగ్రాఫర్ లైన్‌లో పెట్టాడు.ఆమెను ప్రేమలో దించాడు.

ఇంతలో వరుడి సోదరి సాయంత్రం బజారుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది.అనంతరం ఆమె కనిపించలేదు.

ఆ తర్వాత వీడియోగ్రాఫర్ కూడా కనిపించకపోవడంతో పెళ్లి ఇంటి వారిలో అనుమానం మొదలైంది.చివరికి విచారించగా పెళ్లి కొడుకు సోదరి, వీడియోగ్రాఫర్ లేచిపోయినట్లు తేలింది.

రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.

Telugu Ran, Love, Grapher, Latest, Grapherput-Latest News - Telugu

రెండు రోజులుగా బాలిక జాడ లేదు.ఇంతలో తన గ్రామానికి చెందిన వీడియోగ్రాఫర్ ఆ యువతిని తీసుకెళ్లాడని వరుడి బావమరిదికి గ్రామస్తుల నుంచి సమాచారం అందింది.అప్పటి నుంచి కుటుంబ సభ్యులు యువతి కోసం గాలిస్తున్నారు.

తన కుమారుడి పెళ్లికి వచ్చిన వీడియోగ్రాఫర్ తన కుమార్తెను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లాడని చుట్టుపక్కల వారు చెప్పారని బాధితురాలి తండ్రి చెబుతున్నారు.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.నిందితుడిని గోలు కుమార్‌గా గుర్తించారు.

యువకుడిపై చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి పోలీసులను డిమాండ్ చేశారు.తన కుమార్తెను తీసుకురావాలని కూడా అభ్యర్థించారు.

ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube