ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో సీట్ల రగడ కొనసాగుతోంది.సీట్ల మార్పు నేపథ్యంలో వైసీపీలో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ఏలూరు జిల్లాలోని చింతలపూడి అభ్యర్థి మార్పుతో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ నిరాకరించడంతో ఆయన అనుచరులు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
అటు ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయం ఎదుట ఎలిజా అనుచరులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఎలిజాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే చింతలపూడి నుంచి రెబల్ అభ్యర్థిగా ఎలిజా పోటీకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో చింతలపూడి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.