ఆటో ఎక్కుతుండగా విద్యార్థులకు కరెంట్ షాక్.. అసలేమైందంటే?

వారంతా పాఠశాల విద్యార్థులు. రోజూ లాగే ఉదయమే బడికి వెళ్లేందుకు తయారయ్యారు.

 School Children Got Current Shock Touch Auto At Dehradun Details, Students Get C-TeluguStop.com

కాస్తంత టిఫిన్ చేసి పుస్తకాల సంచులన్నీ సర్దుకొని, యూనిఫాం వేస్కొని బయటకు వచ్చారు.వచ్చే ముంతు కుటుంబ సభ్యులకు బై కూడా చెప్పారు.

అయితే తమ పాఠశాలకు చెందిన ఆటో కోసం స్థానిక బస్టాండ్ వద్ద వేచి చూస్తున్నారు.అయితే అప్పటికే విపరీతమైన వర్షం కురుస్తోంది.

ఓ చేత గొడుగులు మరో చేతు టిఫిన్ బాక్సులు.అవి చాలవన్నట్లు భుజాన బ్యాగులు ధరించారు.

అక్కడే ఉన్న స్నేహితులతో మాట్లాడుతూ హాయిగా ఆటో కోసం వేచి చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఆటో వచ్చి ఆగింది.

స్నేహితులకు బై చెప్పి ఆటో ఎక్కేందుకు వచ్చిన ఆ ఇద్దరు విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పిది.అసలేమైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని సెయింట్ థామస్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు.ఆటో కోసం సమీపంలోని బస్టాండ్ లో నిలబడ్డారు.అదే సయంలో భారీగా వర్షం కురుస్తోంది.ఆటో వచ్చిందనే హడా వుడిలో ఎక్కేందుకు ఓ విద్యార్థి వర్షపు నీటిలో దిగాడు.ఆటోను ముట్టుకోగానే కరెంంట్ షాక్ కు గురయ్యాడు.ఆ తర్వాత మరో విద్యార్థిని కూడా ఆటో ఎక్కేందుకు ప్రయత్నించింది.ఒక్కసారిగా షాక్ కొట్టి వరద నీటిలో పడిపోయింది.వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించి కాపాడారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube